Zimbabwe plane crash: నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోవడంతో మరణించిన ఆరుగురు వ్యక్తులలో భారత పారిశ్రామిక వేత్త హర్పాల్ రంధవా మరియు అతని కుమారుడు ఉన్నార జింబాబ్వే మీడియా తెలిపింది. మషావాలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోవడంతో బంగారం, బొగ్గుతో పాటు నికెల్ మరియు రాగిని శుద్ధి చేసే మైనింగ్ కంపెనీ రియోజిమ్ యజమాని రంధావా, అతని కుమారుడు మరియు మరో నలుగురు మరణించినట్లు సమచారం.
సాంకేతిక లోపంతోనే..(Zimbabwe plane crash)
రియోజిమ్‌కు చెందిన సెస్నా 206 విమానం హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మురోవా డైమండ్స్ గని సమీపంలో సింగిల్-ఇంజిన్ విమానం కూలిపోయింది. దీనితో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయారు. విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. బాధితుల్లో నలుగురు విదేశీయులు కాగా, మిగిలిన ఇద్దరు జింబాబ్వే వాసులు ఉన్నారని జింబాబ్వే రిపబ్లిక్ పోలీసులు తెలిపారు సెప్టెంబర్ 29న ఉదయం 7.30 నుండి 8 గంటల మధ్య జరిగిన విమాన ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. మృతుల పేర్లను పోలీసులు ఇంకా విడుదల చేయలేదు, అయితే రంధావా స్నేహితుడైన పాత్రికేయుడు మరియు చిత్రనిర్మాత హోప్‌వెల్ చినోనో అతని మరణాన్ని ధృవీకరించారు.