Site icon Prime9

Houthis Strike: ఎర్రసముద్రంలో భారత్ ఆయిల్ ట్యాంకర్ పై హౌతీల దాడి

Houthis strike

Houthis strike

Houthis Strike:మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచదేశాలపై పడుతోంది. ఎర్ర సముద్రం ద్వారా వచ్చే నౌకలను హౌతీ మిలిటెంట్లు దాడులకు తెగబడ్డం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతోంది. ఇజ్రాయెల్‌ – గాజా మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో హౌతీలు గాజాకు మద్దతు తెలుపుతూ ఈ రూట్‌లలో వెళ్లి నౌకలను హైజాక్‌ చేయడం.. వాటిని విడిపించేందుకు బేరసారాలు చేస్తూ డబ్బు దండుకుంటున్నారు. దీంతో చాలా దేశాలు ఎర్ర సముద్రంగుండా ఇతర మార్గాల ద్వారా సరకు రవాణాను తెప్పించుకుంటున్నారు. ఇక తాజా ఘటన విషయానికి వస్తే.. రష్యా నుంచి ఇండియాకు వస్తున్న ఆయిల్‌ టాంకర్‌ ఎర్ర సముద్రం గుండా వస్తున్న సమయంలో యేమన్‌కు చెందిన మిలిటెంట్లు క్షిపణులతో దాడులకు తెగబడ్డారని ఇరాన్‌కు చెందిన మిలిటెంట్‌ గ్రూపు శనివారం నాడు తెలిపింది.

క్షిపణులతో దాడులు..(Houthis Strike)

ఇదిలా ఉండగా క్షిపణి దాడిలో ఆండ్రోమెడియా ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక దెబ్బతిందని దాని మాస్టర్‌ చెప్పారు. కాగా రష్యాలోని ప్రిమోర్స్క్ నుంచి ఇండియాలోని వాడినార్‌కు వస్తున్న ఓడపై ఈ దాడులు జరిగాయి. అయితే హౌతి మిలిటెంట్లు మాత్రం ఇజ్రాయెల్‌ లేదా అమెరికా, లేదా బ్రిటన్‌తో సంబంధాలు కలిగిన ఓడలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇక ఆండ్రోమెడియా స్టాక్‌ నౌక విషయానికి వస్తే ఈ నౌక యజమాని సీషెల్స్‌లో రిజిష్టర్‌ చేశాడు. అయితే హౌతీ అధికార ప్రతినిధి యహ్‌యా సరేరా మాత్రం బ్రిటిష్‌ యజమానిదని వాదిస్తున్నాడు.ఇక పాలస్తీనా ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో హౌతీలు పాలస్తీనాకు మద్దతు తెలిపారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎర్రసముద్రంలోని బాబ్‌ అల్‌ మండాబ్‌ స్రెయిట్‌, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో గత ఏడాది నవంబర్‌ నుంచి నౌకలపై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేయడం మొదలుపెట్టాయి. ఈ దాడులు మొదలైన వెంటనే సరకు రవాణా నౌకలను ఈ రూట్‌ నుంచి తప్పించి ఇతర రూట్‌లలో సరకు రవాణా చేయడం మొదలుపెట్టాయి. దీంతో సరకు రవాణా కాస్తా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత మొదలైంది.

హౌతి మిలిటెంట్ల ఆగడాలు మితిమీరిపోవడంతో అమెరికాకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు శుక్రవారం ఎర్రసముద్రంలో సూయిజ్‌ కెనాల్‌లో అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలను సురక్షితంగా తరలించుకుపోయాయి. కాగా శుక్రవారం నాడు హౌతీలు యెమెన్‌ని సాదా ప్రావిన్స్‌లో అమెరికాకు చెందిన ఎం క్యూ-9 విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించారు. ఇటీవల కాలంలో భారత నౌకలను లక్ష్యంగా చేసుకొని హౌతి మిలిటెంట్లు హైజాక్‌ చేసి తీసుకువెళ్తున్న ఘటనలు పెరిగిపోయాయి. దీంతో కేంద్రరక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ యుద్ధ విమానాలను పంపి వారి చెర నుంచి వాణిజ్య నౌకను విడిపించిన విషయం తెలిసిందే.

Exit mobile version
Skip to toolbar