Site icon Prime9

Prince Harry : విలియం నాపై దాడిచేసాడు… ఆత్మకధలో సంచలన విషయాలు వెల్లడించిన ప్రిన్స్ హ్యారీ

Prince Harry

Prince Harry

Prince Harry : బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ ఈ నెల 10న విడుదల చేయ నున్న తన ఆత్మకథ స్పేర్ లో సంచలన విషయాలను బయటపెట్టారు. రాచకుటుంబంలో వివాదాలు… ఇలా, ఇంతవరకు బయటి ప్రపంచానికి తెలియని వివరాలను వెల్లడించారని ‘ద గార్డియన్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తన అన్న, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన విలియమ్ తనపై భౌతికదాడికి దిగాడని పేర్కొన్నాడు. తన భార్య మేఘన్ విషయంలో తన అన్నతో వాగ్వాదం జరిగిందని ఈ సందర్బంగా విలియమ్ తనపై దాడిచేసాడని తెలిపాడు.

మేఘన్ విషయంలో ప్రిన్స్ విలియం నాతో ఎప్పుడూ విభేదించేవాడు. ఆమె మొరటు మనిషి అంటూ రెచ్చగొట్టేవాడు. రాచకుటుంబానికి తగినది కాదని చెప్పే వాడు. ఈ క్రమంలో 2019లో ఓ సారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. విలియం నా గల్లాపట్టుకుని, బలంగా కిందకు తోసేశాడు. ఇంట్లో కుక్కకు అన్నం పెట్టే గిన్నెపై వెల్లకిల్లా పడ్డాను. ఆ గిన్నె పగిలిపోయి.. నా వెన్నుకు గాయమైంది. నన్ను లేపడానికి విలియం ప్రయత్నించలేదు” అని హ్యారీ తన పుస్తకంలో పేర్కొన్నాడు. అందుకే తాను, మేఘన్ 2020లో అమెరికాకు వెళ్లిపోయినట్లు తెలిపాడు. జనవరి 10న స్పేర్ మార్కెట్లో రిలీజ్ కానుంది.

Exit mobile version