Abdul Rehman Makki: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి) పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐఎస్‌ఐఎల్ (దయాష్) మరియు అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది.
లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ మక్కీ(Abdul Rehman Makki)ను 2000 ఎర్రకోట దాడి మరియు 26/11 ముంబై ఉగ్రదాడుల సంబంధాల ఆధారంగా గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించారు.
మక్కీ 26/11 దాడికి సూత్రధారి అయిన ఎల్‌ఇటి నాయకుడు మరియు వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు బావ.
2022లో,భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి యొక్క అల్-ఖైదా మరియు ఐఎస్‌ఐఎల్
ఆంక్షల కమిటీ కింద మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రతిపాదించాయి, దీనిని యూఎంఎస్ సి 1267 కమిటీ అని కూడా పిలుస్తారు.
అయితే చైనా ఈ ప్రతిపాదనను నిరోధించింది. . జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌పై ఆంక్షలను అడ్డుకునేందుకు
చైనా గతంలో ఇదే చర్యను ఉపయోగించింది. మక్కీ ను గ్లోబల్ టెర్రిరిస్టుగా ప్రకటించడంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్వాగతించారు.
ఈ ప్రాంతంలో ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కోవడానికి మరియు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడానికి ఇటువంటి ఆంక్షలు “సమర్థవంతమైన సాధనం” అని అన్నారు.
2022లో 1267 కింద హోదా కోసం భారతదేశం మొత్తం ఐదు పేర్లను సమర్పించింది.
అబ్దుల్ రెహ్మాన్ మక్కీ (LeT), అబ్దుల్ రౌఫ్ అస్గర్ (జైష్-ఎ-మహమ్మద్, JeM), సాజిద్ మీర్ (LeT), షాహిద్ మహమూద్ (LeT), మరియు తల్హా సయీద్ (LeT).
మక్కీ కేసును జూన్ 1, 2022న భారతదేశం సమర్పించింది.
భారతదేశం కౌన్సిల్ నుండి నిష్క్రమించిన తరువాత ఈ జాబితా వచ్చింది.
అబ్దుల్ రెహమాన్ మక్కీ ఎవరు?
మక్కీ ను 2008 ముంబై దాడుల తర్వాత భద్రతా మండలి టెర్రరిస్ట్‌గా జాబితాలో చేర్చింది. ఇతను లష్కరే తోయిబా మరియు జెయుడిలో కీలకపదవులు నిర్వహించాడు.
డిసెంబరు 22, 2000న ఎర్రకోటపై దాడిలో మక్కీ పాల్గొన్నాడు. ఈయనకు హఫీజ్, నైబ్ ఎమిర్ బిరుదులు కూడా ఉన్నాయి.
సయీద్ నిర్బంధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల కోర్టు విచారణలకు కూడా అతను హాజరవుతాడు.
మక్కీ ఇస్లామాబాద్‌లో జరిగే కాశ్మీర్ సంఘీభావ దినోత్సవ ర్యాలీలలో పాల్గొంటాడు.
2010లో జరిగిన ఒక ర్యాలీలో, మక్కీ కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు అప్పగించకపోతే భారత్ లో రక్తపుటేరులు పారిస్తామని హెచ్చరించాడు.
మక్కీ గురించి సమాచారం ఇస్తే $2 మిలియన్ల బహుమతిని కూడా ప్రకటించారు. అయినా అతను అజ్ఞాతంలోకి వెళ్లలేదు.
తరువాత కూడా అతను సయీద్ యొక్క విచారణల కోసం తరచుగా కోర్టు గదులలో కనిపించాడు.
సయీద్ గురించి సమాచారం ఇస్తే అమెరికా ప్రకటించిన $10 మిలియన్ల బహుమతిని సవాలు చేస్తూ అతను మరియు సయీద్ 2014లో లాహోర్ హైకోర్టులో సంయుక్తంగా పిటిషన్ వేశారు.
నవంబర్ 2021లో లాహోర్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించిన ఆరుగురిలో మక్కీ కూడా ఉన్నాడు.
పాకిస్తాన్‌లోని పంజాబ్ పోలీస్‌కి చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ మక్కీ మరియు సయీద్‌తో సహా పలువురు జూడి సభ్యులపై 40కి పైగా కేసులు నమోదు చేసింది.
తీవ్రవాద ఫైనాన్సింగ్ మరియు మనీ లాండరింగ్‌ను తనిఖీ చేయడానికి ఉద్దేశించిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే నిఘా సంస్థ అక్టోబర్ 2022లో, పాకిస్తాన్ గ్రే లిస్ట్ నుండి తొలగించింది.
ఎఫ్ఏటిఎఫ్ పరిశీలన ఫలితంగా, 26/11 నాడు ముంబైలో దాడులకు పాల్పడిన వారితో సహా సుప్రసిద్ధ ఉగ్రవాదులపై పాకిస్తాన్ కొన్ని చర్యలు తీసుకోవలసి వచ్చింది” అని భారత్ పేర్కొంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/