Volcano: పశ్చిమ సుమత్రాలోని మౌంట్ మెరాపి అగ్నిపర్వతం బద్దలయింది. ఇండోనేషియా రెస్క్యూ సిబ్బంది 11 మంది పర్వతారోహకుల మృతదేహాలను కనుగొన్నారు. ఈప్రమాదం నుంచి ముగ్గురు పర్వతారోహకులు ప్రాణాలతో బయటపడగా, 12 మంది కనిపించలేదు.
స్దానికులను తరలించిన అధికారులు..( Volcano)
అగ్నిపర్వతం బద్దలవడంతో స్థానికులు తాముండే ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. విస్ఫోటనం సమయంలో మూడు కిలోమీటర్ల బూడిద విడుదలయింది.శనివారం నుండి పర్వతంపై మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నారని పడాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ మాలిక్ తెలిపారు.26 మంది అక్కడనుంచి వెళ్లలేదు. వారిలో ముగ్గురు సజీవంగా మరియు 11 మంది చనిపోయారని కనుగొన్నామని మాలిక్ వివరించారు. గాయపడిన వారు వైద్య చికిత్స పొందుతున్నారని వెస్ట్ సుమత్రా డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ హెడ్ రూడీ రినాల్డి పేర్కొన్నారు.2,891 మీటర్ల ఎత్తులో ఉన్న మెరాపి పర్వతాన్ని ఇండోనేషియా మరియు జావాలో ఫైర్ మౌంటైన్ అంటారు. సెంట్రల్ జావా మరియు యోగ్యకార్తా ప్రావిన్సుల మధ్య సరిహద్దులో ఉన్న ఇది ఇండోనేషియాలో అత్యంత తీవ్రమైన అగ్నిపర్వతంగా పరిగణించబడుతుంది.