Site icon Prime9

Vladimir Putin: రష్యన్ మహిళలు ఎనిమిది కంటే ఎక్కువమంది పిల్లలను కనాలి.. వ్లాదిమిర్‌ పుతిన్‌

Vladimir Putin

Vladimir Putin

Vladimir Putin: రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే జనాభాను పెంచాలని నిర్ణయించారు. దేశంలోని మహిళలను కనీసం ఎనిమిది మందిని లేదా అంత కంటే ఎక్కువ కనాలని కోరుతున్నారు. ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో దేశం తన సైనికులను కోల్పోతున్నందున,వచ్చే దశాబ్దంలోగా దేశంలో జనాభాను గణనీయంగా పెంచుకోవాలని పుతిన్ పేర్కొన్నారు.

పూర్వీకుల సంప్రదాయం కొనసాగిద్దాం..(Vladimir Putin)

అయితే అకస్మాత్తుగా పుతిన్‌ ఈ నిర్ణయం తీసకోవడానికి ప్రధాన కారణం ప్రస్తుతం రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా సైనికులు పెద్ద ఎత్తున చనిపోవడంతో పుతిన్‌ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మాస్కోలో వరల్డ్‌ రష్యా పీపుల్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన వీడియో ద్వారా ప్రసంగం చేశారు. వచ్చే దశాబ్దకాలం నాటికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన అన్నట్టు ఇండిపెండెంట్‌ పత్రిక పేర్కొంది. పుతిన్ మాట్లాడుతూ సంప్రదాయబద్దంగా చూస్తే రష్యాలో ప్రతి కుటుంబం నలుగురు లేదా ఐదు పిల్లలను కంటారు. మన అమ్మమ్మలు. అంత కంటే ముందు తరం వారు కనీసం ఏడు లేదా ఎనిమిది మంది పిల్లలను కనేవారు అని గుర్తు చేశారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని పుతిన్‌ రష్యా ప్రజలకు పిలుపునిచ్చారు. కుటుంబం అనేది కేవలం దేశానికి సమాజానికి సంబంధించిన విషయం కాదు ఇదొక అధ్యాత్మక విషయమని పుతిన్‌ అన్నారు. ద్రవ్య సహాయం, సామాజిక ప్రయోజనాలు, అలవెన్సులు, అధికారాలు లేదా అంకితమైన కార్యక్రమాలు దేశం ఎదుర్కొంటున్న భయంకరమైన జనాభా సవాళ్లను అధిగమించలేవని పుతిన్ పేర్కొన్నారు.

రష్యా – ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం రెండవ శీతాకాలానికి చేరింది. ప్రతి రోజు వేలాది మంది ప్రజలు చనిపోతున్నారు. ప్రజలు ఉన్న గూడును కోల్పోతున్నారని బ్రిటన్‌ రక్షణమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒక అంచనా ప్రకారం ఈ యుద్ధంలో రష్యా సైనికులు సుమారు 3 లక్షల కంటే ఎక్కువ మంది చనిపోయి ఉంటారని ఇండిపెండెంట్‌ అంచనా వేసింది. రష్యాకు చెందిన పాలసీ గ్రూపు అంచనా ప్రకారం దేశం నుంచి సుమారు 8.2 లక్షల నుంచి 9.2 లక్షల మంది దేశం విడిచి పారిపోయారని తెలిపింది.

Exit mobile version