Prime9

Trump warning to iran: ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు

Trump warning to iran: అణు ఒప్పందంపై మరోసారి ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. ఇరాన్ తో అణు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నించి ట్రంప్ ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా అణు ఒప్పందంపై ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు చేశారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదని.. ఇకనైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. పరిస్థితి చేయి దాటకముందే తమతో చర్చలు జరపాలని ట్రంప్ స్పష్టం చేశారు.

 

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడుల అనంతరం.. తమతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్‌కు ఒక అవకాశం తర్వాత మరో అవకాశం ఇస్తూ వచ్చానన్నారు డొనాల్డ్ ట్రంప్. యూఎస్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినప్పటికీ అందుకు టెహ్రాన్‌ అంగీకరించలేదన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని అత్యుత్తమ, అత్యంత ప్రాణాంతకమైన సైనిక పరికరాలను అమెరికా తయారు చేస్తోందని.. అందులో అనేకం ఇజ్రాయెల్‌ వద్ద ఉన్నాయని తెలిపారు. వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఆ దేశానికి తెలుసని.. తర్వాత పరిస్థితి తాను ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.

 

 

ఎన్ని చెప్తున్నప్పటికీ కొందరు ఇరాన్‌ నేతలు తన మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా మాట్లాడుతున్నారని ట్రంప్‌ అన్నారు. కానీ.. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో వారికి కూడా తెలియదన్నారు. ఇరాన్‌లో ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని.. భారీ విధ్వంసం జరిగిందని ట్రంప్‌ చెప్పారు. ఈ మారణహోమం మరింత దారుణంగా మారడానికి కొంత సమయం పడుతుందని.. పరిస్థితులు చేయి దాటకముందే ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని.. తాను చెప్పినట్లు చేస్తే ఇక మరణాలు, విధ్వంసాలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

Exit mobile version
Skip to toolbar