Site icon Prime9

Red Sea: ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటు దారులపై యూఎస్ హోలికాఫ్టర్ల దాడులు.. 10 మంది మృతి

Red Sea

Red Sea

Red Sea: ఎర్ర సముద్రంలో దాడులకు దిగుతున్న హౌతీ తిరుగుబాటు దారులపై అమెరికా నేవీ హోలికాఫ్టర్లు కాల్పులు జరపడడంతో 10 మంది మరణించారు. అంతేకాదు ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహిస్తున్న మూడు బోట్లను యుఎస్ హెలికాప్టర్లు ముంచేసాయి. హెలికాప్టర్‌లపై హౌతీలు కాల్పులు జరిపిన తర్వాత, వారు ఆత్మరక్షణ కోసం తిరిగి కాల్పులు జరిపారు. ఓడకు 20 మీటర్ల దూరంలో ఉన్న నాలుగు పడవల్లో మూడింటిని ముంచి, సిబ్బందిని చంపేశారని యూఎస్ సెంట్రల్ కమాండ్ ( సెంట్ కామ్ ) ఒక ప్రకటనలో తెలిపింది. నాల్గవ పడవ ఈ ప్రాంతం నుండి తప్పించుకుని పోయిందని తెలిపింది.

ఎర్ర సముద్రం ఓడలపై దాడులు..(Red Sea)

సింగపూర్-ఫ్లాగ్డ్, డెన్మార్క్ యాజమాన్యంలోని మరియు నిర్వహించబడుతున్న కంటైనర్ షిప్ అయిన మెర్స్ హంగ్ జౌ నుండి సహాయం కోసం చేసిన అభ్యర్థనకు నౌకాదళం ప్రతిస్పందించిందని సెంట్ కామ్ తెలిపింది, ఎర్ర సముద్రం మీదుగా రవాణా చేస్తున్నప్పుడు 24 గంటల్లో రెండవసారి దాడికి గురైనట్లు నివేదించబడింది.హౌతి నియంత్రణలో ఉన్న యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి మార్స్క్ హాంగ్‌జౌను తాకింది.ఇజ్రాయెల్ మిలిటెంట్ గ్రూప్ హమాస్‌తో పోరాడుతున్న నేపధ్యంలో హమాస్ కు మద్దతుగా కీలకమైన ఎర్ర సముద్రపు షిప్పింగ్ లేన్‌లోని ఓడలను హౌతీలు పదేపదే లక్ష్యంగా చేసుకున్నారు.ఈ దాడులు ప్రపంచ వాణిజ్యంలో 12 శాతం వరకు రవాణా చేసే రవాణా మార్గానికి ప్రమాదంగా మారాయి. ఇరాక్ మరియు సిరియాలోని యూఎస్ దళాలు కూడా డ్రోన్ మరియు రాకెట్ దాడులకు గురయ్యాయి, ఇరాన్ మద్దతుగల సాయుధ సమూహాలచే ఈ దాడులు జరుగుతున్నాయని అమెరికా పేర్కొంది.

Exit mobile version
Skip to toolbar