Site icon Prime9

US Dairy Farm: డెయిరీ ఫాంలో భారీ పేలుడు.. 18 వేల ఆవులు మృతి

US Dairy Farm

US Dairy Farm

US Dairy Farm: అమెరికాలో భారీ ప్రమాదం జరిగింది. టెక్సాస్‌ లోని డిమ్మిట్‌లోని సౌత్‌ ఫోర్క్‌ డెయిరీ ఫాంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 18,000 ఆవులు మృత్యువాత పడ్డాయి. అదే విధంగా డెయిరీ ఫాంలో పని చేస్తున్న ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆవుల విలువ దాదాపు 36 మిలియన్‌ డాలర్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 2013 తర్వాత డెయిరీ ఫాం లో భారీ ప్రమాదం జరగడం ఇదే తొలిసారి అని స్థానిక జంతు సంరక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ పేలుడు ఏప్రిల్ 10న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

భారీగా మీథేన్ విడుదల అవ్వడంతో(US Dairy Farm)

ఈ పేలుడుపై అధికారులు ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. డెయిరీ ఫామ్ లోని మిషన్స్ బాగా వేడెక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన తర్వాత మీథేన్ వాయువు అధిక మొత్తంలో విడుదల అవ్వడం వల్ల ఆవులు మృతి చెంది ఉంటాయని చెబుతున్నారు. కానీ, పేలుడు గల కారణాలపై స్పష్టత రాలేదు. డెయిరీ ఫాంలో పేడ ఎక్కువగా నిల్ల ఉండటం ద్వారా మీథేన్ వాయువు బయటికి వస్తుంది.

 

సిబ్బంది కొరతతో (US Dairy Farm)

కాగా, అమెరికా లాంటి దేశాల్లో 15 వేల కంటే ఎక్కువ ఆవులు పెంచుతున్న ఫాంను ‘బార్‌’గా వ్యవహరిస్తారు. ఇక్కడ డెయిరీ ఫాం పనులన్నీ మిషన్స్ తోనే నడుస్తాయి. కాబట్టి కొంత మంది పనివారే అందుబాటులో ఉంటారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అదుపు చేయడం కుదరలేదు. దాంతో భారీగా ప్రాణనష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే, పాలు నిల్వ చేసే గదిలో మహిళ చిక్కుకుపోవడంతో అదృష్టవశాత్తు గాయాలతో బయటపడగలిగింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు.

 

Exit mobile version