Site icon Prime9

US Billionaire: తుపాకీతో కాల్చుకుని ప్రముఖ బిలియనీర్ ఆత్మహత్య

US Billionaire

US Billionaire

US Billionaire: అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ ఆత్మహత్య చేసుకున్నారు. అమెరికాలో ప్రముఖ పెట్టబడుల సంస్థ లీ ఈక్విటీ అధినేత, బిలియనీర్ థామస్ లీ(78) తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం చెందాడు. యూఎస్ కాలమాన ప్రకారం గురువారం ఉదయం తన కార్యాలయానికి వచ్చిన థామస్ లీ చాలా సేపటి వరకు గదిలో నుంచి బయటకు రాలేదు.

దీంతో అనుమానం వచ్చిన ఆయన వ్యక్తిగత సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా.. బాత్రామ్ లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. హుటాహుటిన 911 కు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి వచ్చే లోపల ఆయన మృతి చెందారు. థామస్ లీ తలకు బులెట్ గాయమైనట్టు పోలీసులు గుర్తించారు.

తనని తాను కాల్చుకుని చనిపోయినట్టు పోలీసులు నిర్ధారణ కు వచ్చారు. థామస్ లీ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. కానీ , ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించలేదు.

థామస్ లీ నేపథ్యమిదే..(US Billionaire)

ప్రముఖ ఇన్వెస్టర్ , ఫైనాన్షియర్ గా థామస్ లీ కి అమెరికాలో మంచి పేరుంది. పెట్టుబడి వ్యాపారులకు, ప్రైవేట్ ఈక్విటీ మార్కెట్టు ఆయన్ను రోల్ మోడల్ గా తీసుకుంటాయి.

థామస్ హెచ్ లీ పార్ట్నర్స్ పేరుతో 1974 లో ఆయన ఓ సంస్థను స్థాపించారు.

ఆ తర్వాత 2006 లో ఈక్విటీని మొదలు పెట్టారు. దాదాపు 50 ఏళ్లుగా ఆయన వందలాది సంస్థల్లో 15 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారు.

బిజినెస్ మెన్ గా, దాతగా మార్కెట్ వర్గాల్లో ఆయనకు మంచి పేరుంది. గతంలో ది లింక్లన్ సెంటర్, మ్యూజియం అండ్ మోడ్రన్ ఆర్ట్, బ్రాండీస్ యూనివర్సిటీ,

హార్వర్డ్ యూనివర్సిటీ, మ్యూజియం ఆఫ్ జెవిష్ హెరిటేజ్ లాంటి సంస్థల్లో ఆయన ట్రస్ట్రీ హోదాలో బోర్డు సభ్యుడిగా ఉన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ దంపతులకు థామస్ లీ మంచి స్నేహితుడు. ఆయన నికర సంపద దాదాపు 2 బిలియన్ డాలర్లు .. అంటే దాదాపు రూ. 16,500 కోట్లకు పైగా అన్నమాట.

Exit mobile version