chikungunya vaccine: దోమల ద్వారా వ్యాపించే చికున్‌గున్యా కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌ను యూఎస్ ఆరోగ్య అధికారులు గురువారం ఆమోదించారు. ఐరోపాకు చెందిన వాల్నెవా తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఇక్స్ చిక్ పేరుతో విక్రయించబడుతుంది. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం ఆమోదించబడిందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డి ఏ)తెలిపింది.
15 ఏళ్లలో 50 లక్షల కేసులు..(chikungunya vaccine)
జ్వరం మరియు తీవ్రమైన కీళ్ల నొప్పులను కలిగించే చికున్‌గున్యా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా మరియు అమెరికాలోని ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా వ్యాపిస్తుంది., చికున్‌గున్యా వైరస్ కొత్త భౌగోళిక ప్రాంతాలకు వ్యాపించింది, ప్రపంచవ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి పెరుగుతోందని ఎఫ్ డి ఏ తెలిపింది, గత 15 సంవత్సరాలలో 5 మిలియన్లకు పైగా చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. చికున్‌గున్యాతీవ్రమైన వ్యాధి. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది, ముఖ్యంగా వృద్ధులకు మరియు అనారోగ్య సమస్యలు ఉన్నవారికి అంటూ ఎఫ్ డీ ఏ అధికారి పీటర్ మార్క్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్స్ చిక్ టీకా ఒక మోతాదులో ఇంజెక్ట్ చేయబడుతుంది.ఉత్తర అమెరికాలో 3,500 మందిపై రెండు క్లినికల్ ట్రయల్స్ జరిగాయి.