Site icon Prime9

F-16 fighter jet fleet: పాక్‌కు ఎఫ్‌-16 యుద్ద విమానాలు అందించనున్న అమెరికా

F-16-fleet-sustainment-programme-pak

Washington: పాకిస్థాన్‌కు 450 మిలియన్‌ డాలర్ల భారీ భద్రతా సహాయం అందించేందుకు జో బైడెన్ సర్కార్‌ ముందుకు వచ్చింది. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎఫ్‌-16 ఫైటర్ జెట్లను అందించనుంది. నాలుగేళ్ల తర్వాత మొదటిసారి ఈ తరహా సహాయానికి అమెరికా ఆమోదం తెలిపింది.

450 బిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో ఎఫ్‌-16 యుద్ధ విమానాలను విదేశీ సైనిక విక్రయానికి ఆమోదిస్తూ యూఎస్‌ స్టేట్ డిపార్ట్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదిత విక్రయం గురించి కాంగ్రెస్‌కు వెల్లడించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమకు పాక్‌ ఒక ముఖ్య భాగస్వామి అని పేర్కొంది. ఈ సహాయం వల్ల ఆ ప్రాంతంలో భద్రతాపరమైన సమతౌల్యానికి ఎలాంటి హానీ ఏర్పడదని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా, 2018లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పాకిస్థాన్‌కు రెండు బిలియన్ల డాలర్ల సహాయాన్ని నిలిపివేశారు. అఫ్గాన్‌ తాలిబన్లు, హక్కానీ నెట్‌వర్క్‌ వంటి ఉగ్ర గ్రూపులను నిలువరించడంలో విఫలమవుతుందంటూ ఆ సహకారాన్ని ఆపేశారు. అలాగే ఉగ్రవాదంపై పోరాటంలో పాక్‌ తమ భాగస్వామి కాదని ఆ సందర్భంగా ట్రంప్‌ అన్నారు.

ఇదిలా ఉండగా పాకిస్తాన్‌ కు పెద్ద ఎత్తున ఫైటర్‌ విమానాలు అందించడం భారత్‌ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మన రక్షణ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version