Prime9

United States: అమెరికాలో భారతీయ సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి

United States: అమెరికాలోని మసాచుసెట్స్ స్టేట్‌లోని వారి ఇంట్లో  భారతీయ సంతతికి చెందిన సంపన్న దంపతులు, వారి కుమార్తె చనిపోయినట్లు మీడియా తెలిపింది. భర్త మృతదేహం దగ్గర తుపాకీ దొరికినందున గృహ హింస కారణంగా ఈ సంఘటన సంభవించే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.

ఆర్దిక ఇబ్బందులే కారణమా?..( United States)

మృతులను రాకేష్ కమల్ (57), అతని భార్య టీనా (54) మరియు వారి 18 ఏళ్ల కుమార్తె అరియానాగా గుర్తించారు, వీరంతా గురువారం సాయంత్రం 7:30 గంటలకు బోస్టన్‌కు 32 కిమీ దూరంలోని డోవర్‌లోని వారి భవనంలో విగతజీవులుగా కనిపించారని , నార్ఫోక్ జిల్లా అటార్నీ మైఖేల్ మోరిస్సే అన్నారు.టీనా మరియు ఆమె భర్తగతంలో ఎడ్యునోవా అనే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కంపెనీని నడిపారు. ఆన్‌లైన్ రికార్డుల ప్రకారం, ఈ జంట ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్లు కనిపించింది. కొన్ని రోజులుగా కుటుంబ సభ్యులనుంచి ఎటువంటి కాల్స్ రాకపోవడంతో బంధువు తనిఖీ చేయడంతో వారి మృతదేహాలు బయటపడ్డాయి.మోరిస్సే ఈ పరిస్థితిని భయంకరమైన విషాదంగా గృహ హింస పరిస్థితిగా అభివర్ణించారు. మెడికల్ ఎగ్జామినర్ తీర్పు వచ్చిన తర్వాతే ఈ ఘటనను హత్య లేదా ఆత్మహత్యగా ప్రకటించగలమని చెప్పారు.

ఎడ్యునోవా కంపెనీ 2016లో ప్రారంభించగా 2021లో మూతపడినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. టీనా కమల్ ఎడునోవా వెబ్‌సైట్‌లో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం యొక్క పూర్వ విద్యార్థి. ఆమె భర్త రాకేష్ బోస్టన్ యూనివర్శిటీ, ఎంఐటీ స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అలాగే స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి అని ఎడ్యునోవా వెబ్‌సైట్‌పేర్కొంది.ఈ కుటుంబ్ నివసించే 11 బెడ్‌రూమ్‌ల భవనం $5.45 మిలియన్ల విలువ ఉంటుందని అంచనా.  2019లో దీనిని కొనుగోలు చేసారు. ఇది ఒక సంవత్సరం క్రితం జప్తు చేయబడింది.  దీనిని మసాచుసెట్స్‌కు చెందిన విల్సోండేల్ అసోసియేట్స్ కి $3 మిలియన్లకు విక్రయించినట్లు తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar