Unexpected Letter Delivery: ఇప్పుడంటే ఇంటర్నెట్.. సోషల్ మీడియా ఉన్నాయి కాబట్టి ఏదైనా విషయం క్షణాల్లో అందరికీ చేరిపోతోంది.
కానీ ఇవన్నీ లేని రోజుల్లో అంతా ఉత్తరాలతోనే మాట్లాడుకునేవారు కదా. ఒకరి నుంచి ఒకరికి సమాచారం వెళ్లాలంటే ఆ ఉత్తరాల వల్లే సాధ్యమయ్యేది.
అయితే, ఒక లెటర్.. ఇంకొకరికి చేరాలంటే రోజులు..నెలలు పట్టేవి. దానికి తోడు పోస్టల్ డిపార్ట్ మెంట్ వాళ్ల నిర్వాహకంతో మరింత లేటు.
దాని వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లు ఎందరో. కానీ ఇప్పుడు ఎక్కడా ఉత్తరాల జాడ కనపడటం లేదు. అయితే తాజాగా ఇంగ్లాండ్ లో ఓ సంఘటన జరిగింది.
అక్కడ పోస్టల్ డిపార్ట్ మెంట్ వాళ్ల పుణ్యమా అంటూ ఓ ఉత్తరం 30 ఏళ్ల తర్వాత డెలివరీ అయింది. అవును మీరు చదివింది నిజమే.. ఒకటి, రెండేళ్లు కాదు ఏకంగా మూడు దశాబ్ధాలు.
అయితే ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే.. ఉత్తరం రాసిన వ్యక్తితో పాటు అందుకోవాల్సిన వ్యక్తి కూడా చనిపోయారట.
1880 ల నాటి కుటుంబ కథల గురించి
తాజాగా యూకేలోని నార్తంబర్ ల్యాండ్ కు చెందిన జాన్ రెయిన్ బో(60)కు ఓ లేఖ అందింది. అది చూసి అతను షాక్ కు గురయ్యాడు.
1995 లో పోస్ట్ చేసిన లెటర్.. 2023 లో డెలివరీ అవ్వడం చూసి ఆయన అవాక్క్ అయ్యారు.
అంతే కాకుండా ఈ లేఖ ఆ ఇంట్లో ఇంతకుముందు నివాసం ఉన్న వెలెరీ జార్విస్ రీడ్ పేరు వచ్చింది.
పదవీ విరమణ చేసిన తర్వాత రెయిన్ బో 2015 నుంచి తన భార్యతో కలిసి వైలాంలోని ప్రజెంట్ ఉంటున్న ఇంట్లోనే నివసిస్తున్నారు.
ఆ లెటర్ 1880 ల నాటిదని ఆయన గుర్తించారు. అందులో అప్పటి కుటుంబ కథల గురించి, చిన్ననాటి జ్ఞాపకాలను గురించి,
ఉత్తరం రాసిన వ్యక్తి పిల్లలు ఎలా ఎదిగారో వివరించారని రెయిన్ బో తెలిపారు.
క్రిస్మస్ కార్డు అనుకుని
మొదట్లో ఆ ఉత్తరం గురించి పెద్దగా పట్టించుకోలేదు రెయిన్ బో. అదేదో క్రిస్మస్ గ్రీటింగ్ కార్డు అనుకున్నారట. తర్వాత అది పాత ఉత్తరంగా గుర్తించినట్టు రెయిన్ బో చెప్పారు.
ఉత్తరం అందుకోవాల్సిన వ్యక్తి లేనందు వల్ల.. అందులో ఏముందో తెలసుకోవాలనే ఆసక్తితో లెటర్ ఓపెన్ చేసిన చదవగా ఆశ్యర్యం వేసిందని ఆయన అన్నారు.
1995 ల నాటి వ్యక్తుల చిన్న నాటి జ్ఞాపకాలు అందులో ఉన్నాయని తెలిపారు.
కానీ రెయిన్ బో నివసించే ఇంటిలో 30 ఏళ్ల క్రితం నివసించిన వ్యక్తి వెలెరీ జార్విస్ రీడ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదని చెప్పారు రెయిన్ బో.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/