UK targets of Indian restaurant against illegal migrants: అమెరికా బాటలో నడిచేందుకు మరో దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసదారులకు ముగింపు పలికేందుకు బ్రిటన్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకేకు అక్రమ వలసలు పెరిగాయని, చాలామంది బ్రిటన్‌లో అక్రమంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామని వెల్లడించారు. దీంతో అక్రమ వలసదారుల్లో గుండెల్లో గుబులు మొదలైంది. వలసలు పెరిగాయని, చాలా మంది అక్రమంగా పనిచేస్తున్నారని గతకొంతకలంగా చర్చ జరుగుతుండగా.. బ్రిటన్ ప్రధాని నేరుగా ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, అమెరికా మాదిరిగానే బ్రిటన్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే బ్రిటన్ దేశంలో ఉన్న భారతీయ రెస్టారెంట్స్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ ప్రభుత్వం ‘యూకే వైడ్ బ్లిట్జ్’ పేరుతో ఎక్కువగా పనిచేసే వలసదారులు భారత రెస్టారెంట్స్‌లో తనిఖీలు చేపట్టిందని తెలుస్తోంది. దీంతో పాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియెన్స్ స్టోర్స్, బార్‌లపై నిర్వహించిన సోదాల్లో చాలా మందిని గుర్తించింది. దీంతో వారిని అరెస్ట్ చేసింది.
ఇదిలా ఉండగా, బ్రిటన్‌లోని హంబర్ సైడ్ ప్రదేశంలో ఉన్న ఓ భారత రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టింది. ఇందులో చట్టవిరుద్ధంగా ఉంటూ పనిచేస్తున్న ఏడుగురిని అధికారులు గుర్తించారు. వీరితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే, సౌత్ లండన్‌లో ఉన్న భారత గ్రాసరీ వేర్‌హౌస్‌లో తనిఖీలు చేయగా.. ఆరుగురు ఉన్నట్లు తెలిసింది.
కాగా, గతేడాది బ్రిటన్ దేశంలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కీర్ స్టార్మర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత బోర్డర్ సెక్యూరిటీపై నిఘా ఉంచింది. అప్పటినుంచి నేటికీ దాదాపు 4వేల మందికిపైగా అక్రమంగా ఉంటూ పనిచేస్తున్నట్లు గుర్తించింది. తాజాగా, భారత రెస్టారెంట్స్‌పై తనిఖీలు చేపట్టడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఇటీవల యూకే పార్లమెంట్‌లో అక్రమ వలసదారుల అడ్డగింత, బార్డర్ రక్షణ, శరణార్థుల బిల్లు తదితర వాటిపై చర్చ జరిగింది.