Site icon Prime9

Twitter Layoffs: ట్విటర్ లో మళ్లీ ఉద్యోగాల కోతలు

Twitter Layoffs

Twitter Layoffs

Twitter Layoffs: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ట్విటర్ గత సీఈఓ పరాగ్ అగర్వాల్ ను ఇంటికి పంపడంతో మొదలు పెట్టిన మస్క్.. ఉన్నత స్థాయి ఉద్యోగులతో పాటు కింది స్థాయి ఉద్యోగుల వరకు సమూల మార్పులు చేశారు.

బోర్డులోని కీలక సభ్యుల పైనా వేటు వేశారు. మరో వైపు లేఆఫ్స్ ప్రకటించడంతో పాటు కొంతమంది ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టారు.

గత నవంబర్ తర్వాత ట్విటర్ ఉద్యోగాల్లో కోతలు ఉండవని ప్రకటించిన ఎలాన్ మస్క్.. ఆ మాట మీద నిలబడలేదు. రెండు విడతలుగా ఉద్యోగులను తొలగించారు.

సేల్స్ , ఇంజనీరింగ్ విభాగంలో కోతలు(Twitter Layoffs)

అయితే, తాజాగా గత వారం మరో సారి ట్విటర్ ఉద్యోగులపై వేటు పడినట్టు తెలుస్తోంది. సేల్స్ , ఇంజనీరింగ్ విభాగంలోని ఉద్యోగులను తొలిగించినట్టు తెలుస్తోంది.

దీనిపై కొందరు ఉద్యోగులు నేరుగా ఎలాన్‌ మస్క్‌కే ఫిర్యాదు చేశారు.

సంస్థ ఆదేశాలతో ట్విటర్‌ యాడ్స్ కోసం పని చేస్తున్నా తమను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారని ఎలాన్ తో మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్విటర్‌ యాడ్స్‌పై

ఉద్యోగులు వారం రోజుల్లోగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని.. సరైన పరిష్కారాన్ని కనుక్కోవాలని ఉద్యోగులపై హుకుం జారీ చేసినట్లు సమాచారం.

అయితే, తాజాగా ఉద్యోగుల్లో కోత విధించడానికి గల కారణం మాత్రం స్పష్ట లేదు.

 

ఈ సమయంలో వారి అనుభవం పనికొస్తుంది

ట్విటర్‌ యాడ్స్‌కు ఓ పరిష్కారం కనుకొనాలంటే కనీసం రెండుమూడు నెలలు పడుతుందని, ఒక వారంలో చేయడం సాధ్యం కాకపోవచ్చని గతంలో ట్విటర్‌లో మానిటైజేషన్‌

మేనేజర్‌గా పనిచేసిన మార్సిన్‌ కల్దుల్క్సా ట్విటర్‌ అభిప్రాయపడ్డారు.

మరోవైపు ట్విటర్‌ యాడ్స్‌, మానిటైజేషన్‌ ఇన్‌ఫ్రాలో పని చేస్తున్న వారంతా ఎంతో అనుభవం ఉన్నవారు అని, పరిస్థితులను చక్కదిద్దడంలో వారికున్న నైపుణ్యం, అనుభవం ఈ సమయంలో ఉపయోగపడతాయని అన్నారు.

 

ట్విటర్ యాడ్స్ లో మార్పులు

ట్విటర్‌లో అనసవరమైన, అభ్యంతరకరమైన యాడ్స్ రావడంపై ఎలాన్‌ మస్క్‌ యూజర్లకు క్షమాపణలు చెప్పారు. ఈ సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ట్విటర్‌లో యూజర్‌ టాపిక్స్‌, కీవర్డ్స్‌ ఆధారంగా ప్రకటనలు కనిపించేలా మార్పులు చేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఉద్యోగులపై మరింత భారం పెడుతున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version