Twitter on BBC : బీబీసీని ప్రభుత్వ నిధుల మీడియాగా పేర్కొన్న ట్విట్టర్ .. దీనికి బీబీసీ సమాధానమేమిటంటే..

ఎలాన్‌ మస్క్‌కు చెందిన ట్విట్టర్‌ తాజాగా బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టర్‌ బీబీసీకి ప్రభుత్వం ఫండింగ్‌ సమకూరుస్తోందని తన ప్రొఫైల్‌ పేజీలో వివరించింది. ఈ ట్వీట్‌ వెల్లడైన వెనువెంటనే ట్విట్టర్‌ లేబుల్‌పై బీబీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మస్క్‌కు గట్టిగానే జవాబిచ్చింది. ప్రజలకు సేవ చేస్తున్నందుకు వారి నుంచి లైసెన్సు రుసుము తీసుకుని మీడియా సంస్థను నడిపిస్తున్నామని వివరణ ఇచ్చింది.

  • Written By:
  • Updated On - April 11, 2023 / 10:38 AM IST

 Twitter on BBC : ఎలాన్‌ మస్క్‌కు చెందిన ట్విట్టర్‌ తాజాగా బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టర్‌ బీబీసీకి ప్రభుత్వం ఫండింగ్‌ సమకూరుస్తోందని తన ప్రొఫైల్‌ పేజీలో వివరించింది. ఈ ట్వీట్‌ వెల్లడైన వెనువెంటనే ట్విట్టర్‌ లేబుల్‌పై బీబీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మస్క్‌కు గట్టిగానే జవాబిచ్చింది. ప్రజలకు సేవ చేస్తున్నందుకు వారి నుంచి లైసెన్సు రుసుము తీసుకుని మీడియా సంస్థను నడిపిస్తున్నామని వివరణ ఇచ్చింది.

 ఎడిటోరియల్ పాలసీ..( Twitter on BBC)

. బ్రిటన్‌కు చెందిన మీడియా హౌస్‌..కొన్ని మీడియా సంస్థలకు ప్రభుత్వం ఫండింగ్‌ చేస్తోందని ట్విట్టర్ తెలిపింది.  అయితే ఎడిటోరియల్‌ పాలసీ మాత్రం స్వతంత్రంగా ఉంటుందన్నారు. ఉదాహరణకు బ్రిటన్‌లో బీబీసీ, అమెరికాలో ఎన్‌పీఆర్‌లని చెప్పుకొచ్చారు. కావాలనుకుంటే ప్రభుత్వం ఎడిటోరియల్‌ పాలసీపై కూడా పెత్తనం చెల్లించే హక్కు కలిగి ఉంటుందని ట్విట్టర్‌ వెల్లడించింది. అదే సమయంలో అమెరికా గురించి ప్రస్తావించింది. అమెరికాకు చెందిన ఎన్‌పీఆర్‌ను తీసుకుంటే దీనికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని పేర్కొంది. న్యూయార్కు టైమ్స్‌ గురించి ఎలాన్‌ మస్క్‌ ఆసక్తికరమైన ట్విట్‌ చేశారు. న్యూయార్కు టైమ్స్‌లో వచ్చే ప్రాపగండా కథనాలు పెద్ద ఆసక్తికరంగా ఉండటం లేదని చురకలంటించారు. తాజాగా బీబీసీ, ఎన్‌పీఆర్‌, న్యూయార్కు లాంటి మీడియా హౌస్‌ల పై విమర్శలు గుప్పించడం పట్ల విమర్శకులు మస్క్‌పై మండిపడుతున్నారు. కాగా నెటిజన్లు మాత్రం మస్క్‌ ట్విట్లపై ఆసక్తి చూపుతున్నారు.

లైసెన్స్ ఫీజుతో నడుపుతున్నాము..

ఇదిలా ఉండగా బీబీసీ తన ట్విట్టర్ హ్యాండ్‌ల్ ద్వారా మస్క్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీబీసీ యాజమాన్యం మాత్రం త్వరలోనే ట్విట్టర్‌తో చర్చలు జరిపి ఈ వివాదాన్ని తెర దించుతామని స్పష్టం చేసింది. కాగా బీబీసీ ఒక ప్రకటనలో బీబీసీ ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడు స్వతంత్ర సంస్థ. తమకు బ్రిటిష్‌ ప్రజలు లైసెన్సు ఫీజు ద్వారా ఇచ్చే డబ్బుతో సంస్థను నడుపుతున్నామని తెలిపింది. దీనికి గురించి బీబీసీ వివరణ ఇస్తూ…. బీబీసీ టెలివిజన్‌ లైవ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ లేదా స్ర్టీమింగ్‌ బ్రిటన్‌లో చూడాలనుకుంటే ఏడాదికి 197 డాలర్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా ఈ నిబంధన ప్రభుత్వం తీసుకువచ్చిందని.. బ్రిటన్‌కు చెందిన పౌరులు ఫీజు చెల్లించి సేవలు పొందుతున్నారని … ప్రభుత్వం ఫండింగ్‌ చేయడం లేదని బీబీసీ వివరణ ఇచ్చుకుంది.

ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేశారు. సంస్థను కొనుగోలు చేసిన వెంటనే ఆయన అమెరికా ప్రెసిడెంట్లను వదల్లేదు. వచ్చే ఎన్నికల్లో జో బైడెన్‌కు ఓటు వేయను. ఓటు వేసి పొరపాటు చేశాను అని కుండబద్దలు కొట్టినట్లు కామెంట్‌ చేశారు. తాజాగా బీబీసీ పై వ్యాఖ్య చేసి సరికొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు.