Turkey Earthquake: సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీ మరియు ఉత్తర సిరియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో వందలది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. అయితే ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భూకంప తీవ్రతను ముందుగానే అంచనా వేసిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసిన కూడా.. తేలికగా తీసుకోవడంతో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగనట్లు తెలుస్తుంది. ముందుగానే సరైన చర్యలు తీసుకొని ఉంటే.. తీవ్రత తక్కువగా ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
Sooner or later there will be a ~M 7.5 #earthquake in this region (South-Central Turkey, Jordan, Syria, Lebanon). #deprem pic.twitter.com/6CcSnjJmCV
— Frank Hoogerbeets (@hogrbe) February 3, 2023
ముందే హెచ్చరించిన పట్టించుకోలేదా..
టర్కీ, సిరియాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. భారీ భూకంపం తలెత్తే అవకాశం ఉందని.. నిపుణులు ముందే హెచ్చరించినట్లు ఓ విషయం వెలుగులోకి వచ్చింది. భూకంప తీవ్రతను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్.. ఈ విపత్తును ముందే అంచనా వేశారు. త్వరలోనే 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందన్నట్లు ట్వీట్ చేశారు. తాజాగా ఆయన అంచనాలు నిజమయ్యాయి.
దీనిపై ఫ్రాంక్ హూగర్‌బీట్స్ స్పందించారు. ఈ సంఘటన ఎంతో కలచివేసిందని తెలిపారు. సంక్లిష్ట రేఖాగణితం ఆధారంగా ముందుగానే అంచనా వేశామన్నారు. ఇప్పటివరకు సంభవించిన దాంట్లో ఇదే అత్యంత తీవ్రమైనదని.. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని వివరించారు. చెప్పినట్లుగానే గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు వచ్చాయి.
భారీ భూకంపం.. ఆస్తి, ప్రాణ నష్టం
శక్తివంతమైన భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత, మధ్య టర్కీలో మరో భూకంపం నమోదయింది.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం, తాజా భూకంపం యొక్క తీవ్రత 7.5.
ఈరోజు తెల్లవారుజామున, 1800 మందికి పైగా మరణించారు.
వందలాది మంది ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
రెస్క్యూ వర్కర్లు నగరాలు, పట్టణాలలో శిథిలాల దిబ్బలను వెలికితీస్తున్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం.
శిథిలాల్లో చిక్కుకున్న వందలాది కుటుంబాలు.
ఆసుపత్రులు క్షతగాత్రులతో త్వరగా నిండిపోయాయని రెస్క్యూ కార్మికులు తెలిపారు.
1999లో వాయువ్య టర్కీలో సంభవించిన ఘోరమైన భూకంపం కారణంగా 18,000 మందికి పైగా మరణించారు.
US జియోలాజికల్ సర్వే ప్రకారం, ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి.
మరోవైపు భూకంపబాధితులను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం సహాయక చర్యలను ప్రకటించింది.
టర్కీకి భారత్ నుంచి ఎన్ డి ఆర్ ఎఫ్. వైద్య బృందాలు వెళ్లాయి.
ప్రభుత్వం భారత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన వారికి పంపించింది.
ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటన విడుదలయింది.
100 మంది సిబ్బందితో కూడిన ఎన్‌డిఆర్‌ఎఫ్‌లోని రెండు బృందాలను ప్రత్యేకంగా వెళ్లింది.
శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌లతో పాటు అవసరమైన పరికరాలను ఈ ప్రాంతానికి పంపుతారు.
వైద్యులు, అవసరమైన మందులతో పారామెడిక్స్‌తో వైద్య బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
రిపబ్లిక్ ఆఫ్ టర్కిప్రభుత్వం అంకారాలోని భారత రాయబార కార్యాలయం రిలీఫ్ మెటీరియల్ పంపబడుతుందని ప్రకటన తెలిపింది.
టర్కీకి అండగా ఉంటామన్న ప్రధాని మోదీ ..
టర్కీలో సంభవించిన భూకంపం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం బాధాకరం.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
భారతదేశం టర్కీ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తుంది .
ఈ విషాదాన్ని ఎదుర్కోవటానికి సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో రాశారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/