Turkey Earthquake Damage: టర్కీలో ఈ నెల 6వ తేదీ భూకంపానికి సుమారు 50వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 342 కోట్ల డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 2.80 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ప్రపంచవ్యాంకు అంచనా ప్రకారం ఈ ఏడాది జీడీపీలో కనీసం 0.50 శాతం నష్టపోయినట్లు అంచనా వేసింది. కాగా ఈ ఏడాది దేశ జీడీపీ 3.5 శాతం నుంచి 4 శాతంగా నమోదు కావచ్చునని వెల్లడించింది. ప్రస్తుతం కూలిపోయిన ఈ భవనాలు నిర్మించాలంటే రెట్టింపు వ్యయం అవుతుందని ప్రపంచబ్యాంక సోమవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇక పొరుగున సిరియాలో పరిస్థితి తీసుకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉందని ప్రపంచబ్యాంకు వైస్ ప్రెసిడెంట్ యూరోప్, సెంట్రల్ ఆసియా వెల్లడించింది. సిరియాకు సంబంధించిన నివేదిక ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు.
లంచాలు తీసుకుని భవనాలకు అనుమతులు..(Turkey Earthquake Damage)
తమ అంచనా ప్రకారం ప్రస్తుతం కూలిపోయిన భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలంటే రెండు నుంచి మూడు రెట్లు వ్యయం పెరిగిపోయే పరిస్థితి ఉంటుందని ప్రపంచవ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ఎన్నీ జెర్డీ చెప్పారు. ఈ నెల 6వ తేదీన సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతగా నమోదైంది. టర్కీ చరిత్రలో ఈ స్థాయిలో భూమికంపించిన దాఖలాల్లేవు. అలాగే ఈ స్థాయిలో ప్రాణాలు కోల్పోయిన దాఖలాల్లేవు. భూకంపానికి సుమారు 44,300 మంది మృతి చెందారు. టర్కీ భారీ భూకంపం తర్వాత సుమారు 7,500 సార్లు భూమి కంపింది. టర్కీ 80 ఏళ్ల చరిత్రలో ఈ స్థాయిలో భూమి కంపించిన ఆనవాల్లేవు.టర్కీలో భవన నిర్మాణానికి అక్కడి టౌన్‌ప్లానింగ్ డిపార్టుమెంటు లంచాలు తీసుకుని ఉదారంగా అనుమతులిచ్చింది. వాస్తవానికి భూకంపం ధాటిని నిలిచే భవనాలు నిర్మించాలి. బిల్డర్ల అత్యాశ, అధికారులు కళ్లు మూసుకొని అనుమతులు ఇవ్వడం వల్ల అమాయకులు బలయ్యారు. టర్కీలో ప్రమాణాలు పాటించని భవనాలు పేకమేడల్లా కూలిపోతే.. నిబంధనల ప్రకారం భూకంపం ధాటికి నిలిచేలా కట్టిన ఇళ్లు మాత్రం చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం. ప్రస్తుతం టర్కీ ప్రెసిడెంట్ నిబంధనలు పాటించని బిల్డర్లపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమించారు.
భూకంపంతో 12.5 లక్షల మంది నిర్వాసితులు..
వరల్డ్ బ్యాంకుకు చెందిన గ్లోబల్ ర్యాపిడ్ పోస్టు డిజాస్టర్ డ్యామేజీ ఎస్టిమేషన్ అంచనా ప్రకారం సుమారు 12.5 లక్షల మంది ప్రజలు ఈ భూకంపం ధాటికి నిర్వాసితులయ్యారు. వీరిలో కొందరి ఇళ్లు పూర్తిగా ధ్వంసం కావడమో లేదా పాక్షికంగా ధ్వంసం కావడమో జరిగింది. తుర్కియేలోని మొత్తం 11 ప్రావిన్స్‌లలో అత్యధికంగా దక్షిణ టర్కీలో భారీ ఎత్తున విధ్వంసం జరిగింది. దేశంలో అత్యధిక పేదరికం కూడా ఇక్కడే. ఈ ప్రాంతంలోనే సిరియాకు చెందిన 17 లక్షల మంది శరణార్థులు నివాసం ఉంటున్నారు. సిరియాలోని మొత్తం శరణార్థుల్లో 50 శాతం మంది తుర్కీలో నివసిస్తున్నారు.
780 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించిన ప్రపంచబ్యాంకు..
ఇదిలా ఉండగా ప్రపంచబ్యాంకు టర్కీ తక్షణ సాయం కింద 780 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. మొత్తానికి ప్రకృతి విపత్తుకు.. అధికారుల లంచగొండితనానికి.. బిల్డర్ల అత్యాశకు బలమైంది మాత్రం సాధారణ టర్కీ పౌరుడు. ఇక నుంచైనా ప్రభుత్వం భవన నిర్మాణ సమయంలో భూకంపానికి తట్టుకు నిలబడేలా ఉండే నిర్మాణాలకు అనుమతిస్తే అదే పదివేలంటున్నారు స్థానిక టర్కీ వాసులు.