Site icon Prime9

France: ఫ్రాన్స్‌లో పెన్షన్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన ట్రేడ్ యూనియన్లు

France

France

France: ఫ్రాన్స్‌లో ట్రేడ్‌ యూనియన్లు మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సమ్మకు పిలుపునిచ్చాయి వివాదాస్పదమైన పెన్షన్‌ సంస్కరణలను దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు ఉద్యోగులు. ట్రేడ్‌ యూనియన్‌ నాయకులుమాత్రం దేశం మొత్తాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే రిటైర్మెంట్‌ వయసును పాత పద్దతికి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వం వద్ద డబ్బులేకపోవడంతో ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు మక్రాన్‌ ప్రభుత్వం 62 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచింది. దీంతో ఉద్యోగులు పూర్తి స్థాయి రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ దక్కిచుకోవాలంటే మరో రెండేళ్ల పాటు పెన్షన్‌స్కీమ్‌కు పెద్ద మొత్తంలో కంట్రిబ్యూట్‌ చేస్తే తప్ప పూర్తి పెన్షన్‌ రాదు. ఇప్పటికే 62 ఏళ్ల వరకు ఉద్యోగాలు చేసి మరో రెండేళ్ల పాటు తాము ఉద్యోగాలు చేయలేమంటున్నారు ఉద్యోగులు. కొత్త పెన్షన్‌ విధానాన్ని వ్యతిరేకించే ఉద్యోగులు , పౌరులు, రిటైర్‌ అయిన వారు పెన్షన్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయాలని సీఎఫ్‌డీటి యూనియన్‌ చీఫ్‌ లారెంట్‌ బెర్గర్‌ ఫ్రాన్స్‌ ఇంటర్‌ రేడియో స్టేషన్‌కు సోమవారం నాడు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తమ ప్రెసిడెంట్‌ చెవిటి వాడు. మా నిరసనలు ఆయనకు వినిపించడం లేదని ఆయన అన్నారు.

 

14 లక్షలమంది సమ్మెలో పాల్గొన్న 14 లక్షలమంది పౌరులు..(France)

సమ్మె విషయానికి వస్తే హార్డ్‌లైన్‌ సీజీటి యూనియన్‌ మంగళవారం ఉదయం నుంచే ఫ్రాన్స్‌లో రిపైనరీల నుంచి ఇంధన డెలివరీని ఆపేస్తామని చెప్పారు. పెట్రోల్‌ స్టేషన్‌లలో ఇప్పటికే పెట్రోల్‌ కొరత ఏర్పడింది. తాజాగా యూనియన్‌ల సమ్మెతో ఈ కొరత మరింత తీవ్రతరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి సమ్మె తీవ్రతరం అయ్యింది. ఉదయం నుంచి రిఫైనరీల నుంచి వచ్చే ట్రక్కులను నిలిపివేశామని సీజీటీ బ్రాంచ్‌ కో ఆర్డినేటర్‌ చెప్పారు. ఈ సమ్మెలో సుమారు పది లక్షల మంది పాల్గొంటున్నారని అంచనా.ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మెను ఇతర రంగాలకు విస్తరిస్తామని హెచ్చరిస్తున్నాయి. వారాంతంలో ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తామని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 260 లోకేషన్లలో సుమారు 11 లక్షల నుంచి 14 లక్షల మంది సమ్మెలో పాల్గొంటున్నారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా పెన్షన్‌ సంస్కరణలకు గతంలో యూనియన్లు ఐదుసార్లు సమ్మెకు దిగాయి. జనవరి రెండవ వారం నుంచి ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం ప్రారంభించారు. అయితే ఈ ఏడాది జనవరి 31వ తేదీన జరిగిన ప్రదర్శనంలో సుమారు 12.7 లక్షల మంది పాల్గొన్నారు. కాగా మంగళవారం నాడు యూనియన్‌ నాయకులు మాత్రం దేశం మొత్తాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరిస్తున్నారు.

 చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి..

హైస్పీడ్‌ రైళ్ల విషయానికి వస్తే ఐదు ప్రాంతీయ ట్రెయిన్‌ సర్వీసులకు గాను ఒక సర్వీసు మాత్రమే నడించింది. రిఫైనరీ వర్కర్లు మాత్రం ప్రభుత్వం మెడలు వంచి డిమాండ్‌ సాధించుకుంటామని భరోసాతో అంటున్నారు. ఇదిలా ఉండగా ఫ్రెంచి ప్రధానమంత్రి ఎలిసబెత్‌ బోర్నే ప్రెంచి టెలివిజన్‌తో సోమవారం నాడు మాట్లాడారు. నిరసన చేపట్టడంతో ఉద్యోగుల హక్కు.. దాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. దేశవ్యాప్తంగా సేవలు నిలిపివేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తెలెత్తుతాయన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం వాదన ఏమటంటే పెన్షన్‌ వ్యవస్థలో మార్పులు చేర్పలు చేయకుంటే రాబోయే సంవత్సరాల్లో ప్రెంచి ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని హెచ్చరిస్తోంది. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలంటే ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేయాలని వాదిస్తోంది. వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే అందరం కలిసి పనిచేయాలని గత నెలలో మక్రాన్‌ ఉద్యోగులతో మాట్లాడుతూ అన్నారు.

ప్రస్తుతం పెన్షన్‌ బిల్లుపై పార్లమెంటు అప్పర్‌ హౌజ్‌లో డిబెట్‌ జరుగుతోంది. లోయర్‌ హౌజ్‌లో రెండు వారాల పాటు పెద్ద ఎత్తున చర్చజరిగింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అసంపూర్ణంగా ముగిసింది. సోమవారం నాడు సెనెట్‌లో కూడా సుదీర్ఘంగా అంటే మంగళవారం ఉదయం మూడు గంటల వరకు కొనసాగినా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఎలాగైనా పెన్షన్‌ బిల్లును రైట్‌ వింగ్‌ మద్దతుద్వారా గట్టెక్కాలని చూస్తోంది. పార్లమెంటరీ ఓటింగ్‌ నుంచి తప్పించుకొని బిల్లును ఆమోదించుకోవాలని మక్రాన్‌ ప్రభుత్వం చూస్తోంది. పార్లమెంటులో ఈ తతంగం కొనసాగుతుండగా.. బయటి అంటే దేశవ్యాప్తంగా నిరసనలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version