Laugh Once a day Law: జపాన్‌లోని యమగటా ప్రిఫెక్చర్‌లో స్థానిక ప్రభుత్వం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రజలు ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా నవ్వాలని పిలుపునిస్తూ ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. అంతేకాదు ప్రతి నెల ఎనిమిదవ రోజు కూడా నవ్వు ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగించుకోవాలని కోరింది. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (ఎల్‌డిపి) చేసిన ఈ చట్టంపై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది.
యమగటా విశ్వవిద్యాలయం యొక్క మెడిసిన్ ఫ్యాకల్టీ ఇటీవలి అధ్యయనాలు నవ్వు మెరుగైన ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు తోడ్పడుతుందని తెలిపారు. తక్కువగా నవ్వే వారిలో మరణాలు, హృదయ సంబంధ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.ఇతర పరిశోధనలు నవ్వు జీవిత ఆనందం, సానుకూల మానసిక వైఖరులు, ఉన్నత స్థాయి సామర్థ్యం, నమ్మకాలను పెంచుతుందని తెలిపాయి.జపనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (జెసిపి) మరియు జపాన్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (సిడిపిజె) సభ్యులు తమ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా నవ్వడానికి ఇబ్బంది పడిన వారికి కష్టమని విమర్శించారు. నవ్వడం లేదా నవ్వకపోవడం అనేది ఆలోచనకు సంబంధించినది. ఇది అంతర్గత స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక మానవ హక్కులలో ఒకటని జేసీపీకి చెందిన టోరు సెకి అన్నారు.అయితే, ఎల్‌డిపి ఈ విమర్శలను ఖండించింది. తాము తెచ్చిన ఆర్డినెన్స్ ప్రజలను నవ్వమని బలవంతం చేయదని మరియు ఏ వ్యక్తి యొక్క వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించందని తెలిపింది. రోజుకు ఒక్కసారైనా నవ్వలేని వారికి జరిమానా విధించే నిబంధన లేదని స్పష్టం చేసింది.