Site icon Prime9

Palestinian restaurant: ఆ రెస్టారెంట్లో మహిళలకు మాత్రమే ప్రవేశం..

Gaza: కఠినమైన కట్టుబాట్లు ఉన్నచోట హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం గొంతు వినిపిస్తూనే ఉంటారు కొందరు. ముఖ్యంగా ఆడవాళ్లను కట్టడి చేసే పాలస్తీనా లాంటి దేశంలో మార్పు కోసం చేసే చిన్న ప్రయత్నం అయినా చాలా పెద్దదే అవుతోంది. గాజాలోని ఈ రెస్టారెంట్ కూడా అలాంటిదే. ‘సబాయియ విఐపి’ పేరుతో గత నెలలో మొదలుపెట్టారు. ఈ రెస్టారెంట్​లోకి కేవలం ఆడవాళ్లను మాత్రమే అనుమతిస్తారు.

పాలస్తీనాలో ఆడవాళ్ల విషయంలో రూల్స్​ ఎక్కువ. చదువు, ఉద్యోగం, కెరీర్ అనేవి వాళ్లలో చాలా మందికి కలగానే మిగిలిపోతుంటాయి. తన జీవితం కూడా అలా కావద్దు అనుకుంది అమీన అల్ హయెక్. చెఫ్​గా ట్రైనింగ్ తీసుకుంది. రెస్టారెంట్​లో జాబ్ చేస్తూ, నచ్చినట్టు బతకాలనుకుంది. కానీ, ఆమెకు ఎక్కడా అవకాశం దొరకలేదు. కారణం, అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లలో చెఫ్​గా మగవాళ్లని మాత్రమే తీసుకునేవాళ్లు.​ అప్పుడే ఆమెకు ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా పెట్టిన ‘సబాయియ విఐపి’ రెస్టారెంట్ గురించి తెలిసింది. ​దీన్ని రీహం హమౌదా అనే ఆవిడ నడుపుతోంది.

‘సబాయియ’ అంటే అరబిక్​ భాషలో ‘ఆడవాళ్లంతా ఒకచోట సరదాగా మాట్లాడుకునే స్థలం​’ అని అర్థం. ఇందులో వండే వాళ్ల నుంచి సర్వ్ చేసేవాళ్ల వరకు అంతా ఆడవాళ్లే ఉంటారు. ఇక్కడ చికెన్ శాండ్​విచ్​, పిజ్జా తింటూ నచ్చినంత సేపు కబుర్లు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇందులో ఎనిమిది మంది పనిచేస్తున్నారు. ‘‘మేం కూడా రెస్టారెంట్​ నడపగలం. మగవాళ్ల సలహాలు, సాయం అవసరం లేకుండా సక్సెస్​ కాగలం. అన్ని పనులు చేయగలమని ప్రపంచానికి చాటడమే తన ఉద్దేశమంటున్నారు అమీనా.

Exit mobile version