Pakistan University: పాకిస్తాన్ యూనివర్శిటీలో ప్రస్తుతం ఓ ప్రశ్నాపత్రంలోని ఓ ప్రశ్నపై పెద్ద దుమారం చెలరేగుతోంది. యూనివర్శటీ పరీక్షల్లో ఒక టీచర్ ప్రశ్నాపత్రంలో విద్యార్థులను సోదరుడు… సోదరి మధ్య సెక్స్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు. ఇది కాస్తా ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది. దీనిపై యూనివర్శిటి విచారణకు ఆదేశించి ప్రశ్నపత్రం తయారు చేసిన టీచర్‌ను ఉద్యోగంలోంచి తీసేసి బ్లాక్ లిస్టులో పెట్టినట్లు న్యూయార్కు పోస్టు పత్రిక వెల్లడించింది.
దీనిపై దేశంలోని సెలబ్రెటిలు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇస్లామాబాద్‌కు చెందిన కామ్‌సాట్స్ యూనివర్శటీ అసభ్యకరమైన ప్రశ్నను విద్యార్థులకు ఎలా ఇస్తుందని నిలదీస్తున్నారు. యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌తో పాటు చాన్సలర్‌ను నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది ఇప్పటికే ప్రశ్నపత్రానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
వివాదాస్పదంగా మారిన ప్రశ్న..(Pakistan University)
గత ఏడాది డిసెంబర్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (బీఈఈ) విద్యార్థులకు జూలి అండ్ మార్క్ సినారియోకు సంబంధించి ఒక వ్యాసం రాయాల్సిందిగా ప్రశ్నాపత్రంలో ఇచ్చారు. జులియా అండ్ మార్క్‌కు సంబంధించి ఒక ప్యాసేజి ఇచ్చి దీనిని పూర్తిగా చదివి అర్ధం చేసుకొని సంగ్రహంగా వ్యాసం రాయాల్సిందిగా ప్రశ్నపత్రంలో విద్యార్థులను కోరారు. ఇక ఆ ప్యాసేజీ విషయానికి వస్తే జులియా మరియు మార్క్ ఇద్దరు సోదరుడు,సోదరి. ఫ్రాన్స్‌కు చెందిన వీరిద్దరు కలిసి కాలేజీలో వేసవి సెలవులు గడపడానికి వేకేషన్‌కు వెళతారు. ఒక రోజు రాత్రి బీచ్‌లోని ఓ కేబిన్‌లో ఏకాంతంగా గడుపుతారు. అయితే వీరిద్దరిలో కోరికలు మొదలవుతాయి. ఇద్దరు కలిసి సెక్స్‌లో పాల్గొంటారు. వీరిద్దరికి ఇది కొత్త అనుభవం అంటూ వ్యాసం చదవి దానికి సంబంధించి జవాబు రాయాల్సి ఉంటుంది.
యూనివర్శిటీపై నిప్పులు కక్కిన సెలబ్రిటీలు..
యూనివర్శిటీ ఇచ్చిన ప్రశ్నా పత్రంలో విద్యార్థులను ఈ వ్యాసం మొత్తం చదివి జులి, మార్క్‌ల సెక్స్ గురించి మీ అభిప్రాయం తెలియజేయాలని ప్రశ్నా పత్రంలో విద్యార్థులను కోరారు. ప్రస్తుతం ఈ అంశం పాకిస్తాన్‌లో పెద్ద దుమారమే చెలరేగింది. పాక్ సెలెబ్రిటిలు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా యూనివర్శిటీపై నిప్పులు గక్కారు. ట్విట్టర్లో తమ అక్కసు వెళ్లగక్కారు. నటి, గాయని హిషి ఖాన్ మీకు సిగ్గుందా అని యూనివర్శటీపై మండిపడ్డారు. యూనివర్శిటీకి తాళాలు వేసి.. ప్రశ్నాపత్రం తయారుచేసిన టీచర్‌ను వెళ్ల గొట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రశ్న తయారు చేసిన టీచర్‌ను జైలుకు పంపాలని.. ఇలాంటి అసభ్యకరమైన ప్రశ్న వేయడానికి ఎంత ధైర్యం మీకు అంటూ మండిపడ్డారు.
టీచర్ ను తొలగించిన యూనివర్శిటీ..
దేశంలోని టాప్ యూనివర్శిటీలు పాకిస్తాన్ యువతను పెడదోవ పట్టిస్తున్నాయని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాప్‌కు చెందిన షారియార్ భుకారీ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫాంపై కామెంట్ చేశారు. మన సంస్కృతిని, మన మత విలువలను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. కాగా ఈ ప్రశ్నకు తయారు చేసిన టీచర్‌పై యూనివర్శటీ విచారణ జరిపి ఉద్యోగంలోంచి తొలగించింది. బ్లాక్‌లిస్టులో పెట్టిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. విద్యార్థులకు ఇలాంటి ప్రశ్నలు వేసి విద్యార్థులకే కాదు.. వారి కుటుంబాలను కూడా మనోవేదనకు గురి చేశారని న్యూయార్కు పోస్టులో పేర్కొంది. ఇలాంటి ప్రశ్నలు తీవ్ర అభ్యంతకరమైనవని .. యూనివర్శిటీ పాఠ్య ప్రణాళిక చట్టానికి కూడా ఇది వ్యతిరేకమని పాక్ విద్యావేత్తలు కూడా యూనివర్శిటీపై మండిపడుతున్నారు.