Site icon Prime9

Myanmar: ఆంగ్‌ సాన్‌ సూకీకి కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష.. ఎందుకంటే..?

Aung San Suu Kyi

Aung San Suu Kyi

Myanmar: మయన్మార్‌ రాజకీయ నేత  ఆంగ్‌ సాంగ్‌ సూకికి స్థానిక కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. గత 18 నెలల నుంచి ఆమెపై వచ్చిన పలు ఆరోపణలపై కోర్టు విచారణ జరిపి శిక్ష ఖరారు చేసింది. ఇక ఆమెపై వచ్చిన ఆరోపణల విషయానికి వస్తే అవినీతి, చట్ట విరుద్ధంగా వాకీ టాకీ కలిగి ఉండటంతో పాటు, కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారనే చార్జీలు ఆమెపై నమోదయ్యాయి. కాగా ఈ చార్జీలన్నీ రాజకీయ ప్రేరేపితంగా భావిస్తున్నారు. కాగా గత ఏడాది ఫిబ్రవరిలో మిలిటరీ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి ఆమెపై మిలిటరీ పాలకులు రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు.

ఆమెపై మోపిన చార్జీలన్నిటికి కలిపి శుక్రవారం నాడు కోర్టు తీర్పు ఇచ్చేసింది. ఇక ఆమెపై ఎలాంటి చార్జీలు పెండింగ్‌లో లేవని కోర్టు వర్గాలు తెలియజేశాయి. శుక్రవారం నాడు కోర్టులో ముగిసిన వాదనల విషయానికి వస్తే ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, అలాగే ఆమె కేబినెట్‌ మంత్రి విన్‌ మయట్‌ ఆయేను హెలికాప్టర్‌ కొనుగోలు చేయడానికి అనుమతించడంతో పాటు దాని మెయిన్‌టెనెన్స్‌ బాధ్యతలు అప్పగించారనే ఆరోపణలపై విచారణ జరిగింది. కాగా యయన్మార్‌లో ఆమె డి ప్యాక్టో ప్రభుత్వ హెడ్‌ ఉన్నారని..కాగా ప్రెసిడెంట్‌గా విన్‌ మియంట్‌ నామమాత్రమే అంటున్నారు. వెనుకుండి చక్రం తిప్పేది మాత్రం సూకీనే. కాగా ఆమె స్టేట్‌ కౌన్సిలర్‌గా కొనసాగారు. కాగా ఈ కేసులో ప్రెసిడెంట్‌ కూడా సహ నిందితుడుగా ఉన్నారు. కాగా సూకీ గతంలో సుమారు 26 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు. ప్రస్తుతం 77 ఏళ్ల ఆంగ్‌ సాన్‌ సూకీకి కోర్టు ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించినందు వల్ల తదుపరి ఆమె ముందున్న ఆప్షన్‌ ఏమిటనే విషయంపై చర్చ సాగుతోంది.

మయన్మార్‌ రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం మిలిటరీ పాలకులు ఆమెను జైలుకు పంపిస్తారా.. లేక హౌజ్‌ అరెస్టు కు అనుమతిస్తారా లేదంటే విదేశీ రాయబారులతో భేటికి అనుమతిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మిలిటరీ పాలకులు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల ఆసక్తి కనబర్చడం లేదు. అయితే ఆమె మద్దతుదారులు మాత్రం ఆమెపై మోపిన చార్జీలంతా ఫేక్‌ అని.. ఆమెను రాజకీయాల నుంచి పూర్తిగా తొలగించాలనేది మిలిటరీ పాలకుల ప్రధాన ఉద్దేశమని అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version