Site icon Prime9

Best cities are Dubai and Abu Dhabi: అత్యుత్తమ నగరాలుగా దుబాయి, అబుదబీలు

Best cities

Best cities

International News: విదేశాలకు వలస వెళ్లి ఉద్యోగాలతో పాటు నివాసం ఏర్పర్చుకోవాలనే వారి కోసం ఇంటర్‌ నేషన్స్‌ అనే సంస్థ ఒక జాబితాను విడుదల చేసింది. వాటిలో దుబాయి, అబుదబీలు అత్యుత్తమ నగరాల ర్యాంకుల్లో వరుసగా రెండో స్థానం తొమ్మిదవ స్థానం ఆక్రమించాయి. ఈ రెండు నగరాలు ఉద్యోగాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండటంతో పాటు అత్యుత్తమైన నాణ్యమైన జీవితాలను అనుభవించవచ్చునని గ్లోబల్‌ నెట్‌వర్క్‌ నేషన్స్‌ తాజా నివేదికలో పేర్కొంది.

ప్రపంచంలోని అత్యత్తుమ నగరం విషయానికి వస్తే స్పెయిన్‌లోని వెలెన్సీయా నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించింది. విదేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి నివాసం ఏర్పర్చుకోవడానికి అనుకూలైమన నగరం. దీంతో పాటు మెక్సికో నగరం మూడవ స్థానం ఆక్రమించింది. నాలుగో అత్యుత్తమ నగరం లిస్బన్‌, కాగా ఐదవ స్థానం మాడ్రిడ్‌ ఆక్రమించినట్లు వార్షిక ఎక్స్‌పాట్‌ సిటి ర్యాంకింగ్‌ 2022లో వెల్లడించింది. కాగా ఈ రిపోర్టును మంగళవారం నాడు విడుదల చేసింది.

అత్యుత్తమ నగరాల విషయానికి వస్తే టాప్‌ 10లో బ్యాంకాక్‌ ఆరవ స్థానం, బాసెల్‌ ఏడవ స్థానం, మెల్బోర్న్‌ ఎనిమిద స్థానం, సింగపూర్‌ 10వ స్థానం ఆక్రమించినట్లు ఇంటర్‌ నేషన్స్‌ వెల్లడించింది. కాగా ఎక్స్‌పాట్‌ ఎస్సెన్సియల్‌ ఇండెక్స్‌కు 45 లక్షల మంది సభ్యులున్నారు. ప్రపంవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న వలసదార్లు తమ మకాం యూఏఈకి మార్చాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వ విధానాలు, వీసా నిబంధనలు, కొవిడ్‌ -19 తర్వాత దేశం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడ్డం తదితర అంశాలు ఇక్కడికి రావడానికి అనుకూలాంచే అంశాలు. అరబ్‌ వరల్డ్‌లో యూఏఈ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇటీవలే కాలంలో ఆర్థిక, న్యాయ, సామాజిక సంస్కరణలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం మొదలుపెట్టింది. దీంతో నైపుణ్యం కలిగిన కార్మికులను తమ కంపెనీల్లోకి పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్‌ చేసుకుంది. తమ వ్యాపారాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకుంది.

ప్రపంచంలోని అతి చెత్త నగరాలు నివాస యోగ్యం కానీ నగరాల విషయానికి వస్తే.. జోహన్సెస్‌బర్గ్‌ 50వ స్థానం, ఫ్రాంక్‌ఫర్ట్‌ 49వ స్థానం. పారిస్‌ 48వ స్థానం ఆక్రమించాయి. ఇక జోహెన్స్‌బర్గ్‌ విషయానికి వస్తే లో క్వాలిటి లైఫ్‌తో పాటు ఉద్యోగులు కూడా ఇక్కడ పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఫ్రాంక్‌ఫర్ట్‌తో పాటు పారిస్‌ కూడా నివాస యోగ్యం కాదని చెబుతున్నారు.

Exit mobile version