Site icon Prime9

Steve Jobs Sandals: 50 ఏళ్లనాటి చెప్పులు రూ.1.77 కోట్లకు అమ్ముడయ్యాయి.

sandals

sandals

California: యాపిల్‌ సహ వ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ ధరించిన చెప్పులు దాదాపు $220,000కి అమ్ముడయ్యాయని వేలం సంస్థ తెలిపింది. 1970ల మధ్యకాలం నాటి “బాగా ఉపయోగించిన” ఈ చెప్పుల కోసం వేలంలో అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించిందని జూలియన్స్ వేలం ఆదివారం తెలిపింది.

కార్క్ మరియు జ్యూట్ ఫుట్‌బెడ్ స్టీవ్ జాబ్స్ పాదాల ముద్రను నిలుపుకుంది. ఇది చాలా సంవత్సరాల ఉపయోగం తర్వాత రూపొందించబడింది” అని తన వెబ్‌సైట్‌లోని లిస్టింగ్‌లో తెలిపింది. ఈ చెప్పులు $60,000 ధర పలుకుతాయని అంచనా వేయబడింది. చివరి విక్రయ ధర $218,750 గా నిలిచింది. అయితే కొనుగోలుదారు పేరు చెప్పలేదు.

జాబ్స్ మరియు స్టీవ్ వోజ్నియాక్ 1976లో కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లోని జాబ్స్ తల్లిదండ్రుల ఇంట్లో ఆపిల్‌ను సహ-స్థాపించారు. 2013లో, లాస్ ఆల్టోస్ హిస్టారికల్ కమీషన్ దీనికి చారిత్రాత్మక మైలురాయిగా పేరు పెట్టింది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సమస్యలతో 2011లో జాబ్స్ మరణించారు.

Exit mobile version