Site icon Prime9

Terrorists Attack: హోటల్ పై ఉగ్రవాదుల విధ్వసం.. ఆత్మాహుతి దాడిలో 9 మంది మృతి

terrorists attack on a hotel in somalia

terrorists attack on a hotel in somalia

Terrorists Attack: ఓ హోటల్‌పై ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. పేలుడు పదార్ధాలతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది అమాయకులు దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన సోమాలియాలో జరిగింది.

సోమాలియా దేశంలో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. రాధాని మొదగిషు పట్టణానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్మయో నగరంలోని తవక్కల్ హోటల్ పై దాడి చేశారు. తొలుత పేలుడు పదార్థాలతో నింపిన కారుతో గేటును ఢీకొట్టి ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. తర్వాత హోటళ్లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో తొమ్మిది మంది మరణించగా, మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా మృుతల్లో నలుగురు భద్రతా సిబ్బంది, విద్యార్థులు ఉన్నట్లు సెక్యూరిటీ మినిస్టర్‌ యూసుఫ్‌ హుస్సేన్‌ ధుమాల్‌ తెలిపారు. హోటల్‌ సమీపంలోనే ఓ పాఠశాల ఉందని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు గాయపడ్డారని ఆయన వెల్లడించారు. వెంటనే సమాచారం మేరకు భద్రతా బలగాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. దీనితో బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆత్మాహుతి దాడిలో మరో ఉగ్రవాది చనిపోయాడు. ఇకపోతే ఈదాడికి అల్‌-షబాబ్‌ ఉగ్రవాద సంస్థే బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది. అల్‌ఖైదాతో దగ్గరి సంబంధాలున్న అల్‌-షబాబ్‌ దేశంలో ఇలా తరచూ విధ్వంసానికి పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలిగొంటుంది.

ఇదీ చదవండి: టపాసుల దుకాణంలో అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం

Exit mobile version