CM MK Stalin: జపాన్ అధికారిక పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆదివారం నాడు రాజధాని నగరం టోక్యోకు బుల్లెట్ రైలులో బయలు దేరారు. 500 కిమీ ప్రయాణం కేవలం రెండున్నర గంటలు మాత్రమే పడుతుందని ట్వీట్ చేసారు.
భారతదేశంలో కూడా రావాలి..(CM MK Stalin)
“ఒసాకా నుండి టోక్యోకి # బుల్లెట్‌ట్రెయిన్‌లో ప్రయాణం; రెండున్నర గంటలలోపు సుమారు 500 కి.మీల దూరాన్ని చేరుకుంటాము. #BulletTrainకి సమానమైన రైల్వే సర్వీస్ డిజైన్‌లోనే కాకుండా వేగం మరియు నాణ్యతలో కూడా మన భారతదేశంలో కూడా ఉపయోగంలోకి రావాలి. పేద మరియు మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం పొందాలి. వారి ప్రయాణం సులభతరం కావాలి! #ఫ్యూచర్ ఇండియా అని అన్నారు. తమిళనాడుకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రిసింగపూర్, జపాన్‌ల రెండు దేశాల అధికారిక పర్యటనకు శ్రీకారం చుట్టారు.