Prime9Special: సమరానికి సై అంటోంది తైవాన్. అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ అడుగు పెట్టిన వెంటనే చైనా తన ఉగ్రరూపం ప్రదర్శించింది. చెప్పిన ప్రకారమే తైవాన్ తీర ప్రాంతంలో మిలిటరీ డ్రిల్ మొదలుపెట్టింది. కయ్యానికి కాలు దువ్వింది. తైపీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించింది. చైనా కవ్వింపునకు తైపీ కూడా గట్టి సమాధానం ఇవ్వడానికి సమాయత్తమవుతోంది.
తైవాన్ తీర ప్రాంతంలో అతి పెద్ద మిలిటరీ డ్రిల్‌ను చైనా ముగించిన వెంటనే తైవాన్ కూడా ఈ రోజు ఉదయం నుంచి లైవ్ ఫైర్ డ్రిల్ మొదలుపెట్టింది. తాము కూడా వెనక్కి తగ్గేది లేదని చైనాకు గట్టి జవాబిస్తామని స్పష్టం చేస్తోంది. నాన్సీ పెలోసీ తైపే నుంచి వెనక్కి మరలిన వెంటనే చైనా తన విశ్వరూపం చూపడం మొదలుపెట్టింది. ఆదివారం తో ముగిస్తానన్న మిలిటరీ డ్రిల్ బుధవారం వరకు కొనసాగించి తీవ్ర ఉద్రిక్తతకు తెరలేపింది. పెలోసీ పర్యటనను అడ్డుపెట్టుకొని చైనా తైవాన్‌ను ఆక్రమించాలనుకుంటోందని తైవాన్ ఆరోపిస్తోంది.
ఇదిలా ఉండగా స్వీ రక్షణ కోసం తాము కూడా హోవిట్జర్‌లో ట్యాంకులతో డ్రిల్‌ను మొదలుపెట్టామని తైవాన్ ఎనిమిదవ ఆర్మీ కార్ప్స్ అధికార ప్రతినిధి లు వోయి జోయె తెలిపారు. తైవాన్‌కు దక్షిణాన ఉన్న పిన్‌టుంగ్‌లో ఉదయం 8.00 గంటలకు సుమారు గంట పాటు సైనిక కవాతు నిర్వహించింది. తీర ప్రాంతంలో ట్రక్కులు ఒక దాని పక్కన ఒకటి ఉంచి సైనికులు సముద్రంలో ఒక దాని తర్వాత ఒక హోవిట్జర్ ఫిరంగులను పేల్చారు ఇది లైవ్‌లో చూపించారు. మంగళవారం నాడు కూడా ఇదే తరహాలో పింగ్‌టుంగ్‌లో వందలాది మంది సైనికులతో ఇలాంటి డ్రిల్లే నిర్వహించినట్లు మిలిటరీ అధికారులు తెలియజేశారు.
ఇదిలా ఉండగా సైనికాధికారులు మాత్రం చైనా వార్ గేమ్స్‌కు ప్రత్యామ్నాయంగా డ్రిల్ నిర్వహించలేదని.. షెడ్యూలు ప్రకారం ముందుగా నిర్ణయించిన దాని ప్రకారమే మిలిటరీ డ్రిల్లు నిర్వహించామని, ఈ డ్రిల్లుకు ప్రత్యేకత లేదని, ఆయన తీవ్రతను తగ్గించడానిక ప్రయత్నించారు. తమ ముందు రెండు గోల్స్ ఉన్నాయని ఒకటి తమ వద్ద ఉన్న ఆర్డిలరీ సక్రమంగా పనిచేస్తుందా లేదా అనేది ఒక కారణంగా కారణంగా రెండోది మెయిన్‌టెనెన్స్ అని ఆయన వివరించారు. గత ఏడాది ఏడాది కూడా ఇలాంటి వార్షిక డ్రిల్‌ను చేపట్టామని చెబుతున్నారు.
మొత్తానికి తాజా తైవాన్ మిలిటరీ డ్రిల్స్‌ను బట్టి చూస్తే, చైనా డ్రిల్ బుధవారం నాడు పూర్తయిన వెంటనే తైపీ కూడా మిలిటరీ డ్రిల్‌కు దిగడాన్ని బట్టి చూస్తే యుద్దానికి సన్నద్దం కావడానికి మానసికంగా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. వివిధ టాస్క్‌లను తైపీ విజయవంతంగా పూర్తి చేసిందని తైవాన్ స్ర్టెయిట్ టైమ్స్ పేర్కొంది. దీంతో పాటు తైవాన్ సముద్రతీర ప్రాంతంలో నిఘా కొనసాగుతోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే చైనా మాత్రం తమ మిటరీ కవాతు కొనసాగుతుందని, యుద్ధానికి తాము సిద్దంగా ఉన్నామని స్పష్ఠంగా చెబుతోంది.
బుధవారం నాడు చైనాకు చెందిన తైవాన్ వ్యవహారాలను చూసే కార్యాలయం బీజింగ్‌లో ఒక ప్రకటన చేస్తూ, తన పొరుగున ఉన్న దేశంపై ఫోర్స్‌ను ఉపయోగించమని, అయితే అవసరం అనుకున్నప్పడు మాత్రం తప్పకుండా వినియోగించుతామని పరోక్షంగా తైవాన్‌ను హెచ్చరించింది. తైపీతో శాంతియుతంగానే తమలో విలీనం చేసుకోవాలనుకుంటున్నామని స్పష్టం చేసింది. ఇలాంటి శ్వేత పత్రాన్ని చైనా 2000 సంవత్సరంలో విడుదల చేసింది. ఇదిలా ఉండగా తైవాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ రోజు జరిగిన సమావేశంలో చైనా ప్రతిపాదించిని ఒక కంట్రీ, టూ సిస్టమ్ మోడల్ ప్రతిపాదనను వ్యతిరేకించింది.
నాన్సీ పెలోసీ తైపే పర్యటనను అడ్డుపెట్టుకొని చైనా వన్ కంట్రీ టూ సిస్టమ్ ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం ఇదే మోడల్ హాంకాంగ్ .. మకావ్‌లో చైనా కొనసాగిస్తోంది. ఇదే మోడల్‌ను తైవాన్‌లో కొనసాగించాలని చైనా యత్నిస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా తైవాన్‌ను కబళించడానికి చైనా ప్రయత్నిస్తోంది. అమెరికా సాయంతో చైనా ఆక్రమణ నుంచి తప్పుకోవాలని తైవాన్ ప్రయత్నిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటికే ప్రపంచం ద్రవ్యోల్బణంతో విలవిల్లాడిపోతోంది. ఇక తైవాన్‌పై చైనా యుద్ధానికి దిగిఏ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితి రావద్దని కోరుకుందాం.