Taiwan: చైనా తూర్పు తీరంలో స్వయం ప్రతిపత్తి కలిగిన తైవాన్ ద్వీపంలో ఆదివారం మరోసారి బలమైన భూకంపం సంభవించింది. తైవాన్‌లోని యుజింగ్ నగరంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:14 గంటలకు భూకంపం సంభవించిందని USGS తెలిపింది. ఐతే శనివారం అదే ప్రాంతంలో 6.5 తీవ్రతతో కూడా భూకంపం వచ్చిందని, 24 గంటల్లోనే మళ్లీ అదే తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలుస్తుంది.
భారీ భూకంపం రావడంతో పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద అపార్టమెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. రాజధాని తైపీలో కూడా ప్రకంపనలు సంభవించాయి.