Sri Lanka crisis: శ్రీలంకలో కిలో బియ్యం రూ.200.. కిలో క్యారెట్‌ రూ.490

శ్రీలంకలో పాలకుల నిర్వాకం ప్రజలకు శాపంగా మారింది. దేశాన్ని దోచుకుపోయిన గొటబాయ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తుండగా శ్రీలంక సామాన్యుడికి మాత్రం పూటగడవడం కూడా కష్టమైపోయింది. లంకలో ఆర్థిక సంక్షోభంతో మొదలైన ప్రజల కష్టాలు మరింత పెరిగిపోయాయి. నిత్యావసర సరకుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి.

  • Written By:
  • Publish Date - July 13, 2022 / 07:34 PM IST

Sri Lanka: శ్రీలంకలో పాలకుల నిర్వాకం ప్రజలకు శాపంగా మారింది. దేశాన్ని దోచుకుపోయిన గొటబాయ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తుండగా శ్రీలంక సామాన్యుడికి మాత్రం పూటగడవడం కూడా కష్టమైపోయింది. లంకలో ఆర్థిక సంక్షోభంతో మొదలైన ప్రజల కష్టాలు మరింత పెరిగిపోయాయి. నిత్యావసర సరకుల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ధరలు చూస్తే పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. 1948 లో స్వాతంత్ర్యం తరువాత ఇలాంటి గడ్డు పరిస్థితిని శ్రీలంక ఎప్పుడూ చూడలేదు. నిత్యావసర సరకుల ధరత సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. బియ్యం ధర కిలో 145 రూపాయల నుంచి ఏకంగా 220కి ఎగబాకింది.

క్యారెట్‌ కిలో 490 రూపాయలు పలుకుతోంది. పెట్రోల్‌ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. ధరలను స్థిరీకరించేందుకు కరెన్సీ స్థిరీకరణకు శ్రీలంక సెంట్రల్‌ బ్యాంకు ఏప్రిల్‌లో కీలక వడ్డీరేట్లు పెంచినా ఆశించిన ఫలితాలు సమకూరలేదు. ఇంధనం, ఎరువులు, ఆహారం, మందుల దిగుమతులపై అవసరమైన విదేశీ మారక ద్రవ్యం నిల్వల కొరత కూడా లంక పరిస్థితిని మరింత దిగజార్చింది. కరోనా మహమ్మారితో పర్యాటక రంగం కుదేలవడంతో దాని ప్రభావంతో లంక ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కావడంతో లంక ఆర్థిక వ్యవస్థ సంక్షొభానికి దారితీసింది.

దీంతో పాటు విదేశాల్లో ప‌నిచేసే లంకేయులు పంపే నిధులు త‌గ్గిపోవ‌డం, ప్రభుత్వ రుణాలు పేరుకుపోవ‌డంతో ప‌రిస్ధితి మ‌రింత దిగ‌జారింది. ఇక ఇంధ‌న ధ‌ర‌ల పెంపు, ర‌సాయ‌న ఎరువుల దిగుమ‌తిపై నిషేధంతో వ్యవ‌సాయ రంగం కుదేలైంది. ద్రవ్యోల్బణం క‌నివినీ ఎరుగ‌ని స్ధాయిలో ఎగ‌బాక‌డంతో 70 శాతం మంది లంకేయులు ఇప్పుడు ఆహార వినయోగాన్ని తగ్గించారని యూనిసెప్‌ ఒక నివేదికలో పేర్కంది.