America: అమెరికా అంతర్జాతీయ విమాన సర్వీసులో అందులోనూ బిజినెస్ క్లాస్ ప్రయాణికులను అనుకోని అతిథి బెంబేలెత్తించింది. ఫ్లోరిడాలోని న్యూజెర్సీకి బయలు దేరిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులకు పాము కనిపించింది. దీనితో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
విమాన సర్వీసులను నడిపే ముందు ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వాటిలోకి ప్రయాణికులను అనుమతిస్తారు అదే సమయంలో విమానాన్ని అన్ని విధాలుగా చెక్ చేసిన తర్వాతే సర్వీసులను ప్రారంభిస్తారు. అయితే కొన్ని సందర్బాల్లో ప్రయాణికులను అనుకోని అతిథులు పలకరిస్తుంటాయి. ఈ తరుణంలోనే అమెరికా విమాన సర్వీసులో అందులోనూ బిజినెస్ క్లాస్లో ఉన్న ప్రయాణికులకు పాము కనిపించింది. దానితో ప్రయాణికులంతా హడలెత్తిపోయి కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తమై వైల్డ్‌లైఫ్ ఆపరేషన్స్ సిబ్బంది, పోర్ట్ అథారిటీ పోలీస్ అధికారుల సహకారంతో విషరహిత “గార్టెర్ స్నేక్”ని పట్టుకున్నారు. తర్వాత దానిని అడవిలోకి విడిచిపెట్టారు. వెంటనే అందరూ సురక్షితంగా ఉన్నారనీ న్యూయార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
కాగా అంతకుముందు, ఫిబ్రవరిలో, మలేషియాలోని ఎయిర్ ఏషియా విమానంలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. విమానం గాలిలో ఉండగానే విమానంలోపాము కనిపించిన ఘటన ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది.
ఇదీ చదవండి: యాపిల్‌కు రూ. 150 కోట్ల జరిమాన..!