Site icon Prime9

Singapore: సింగపూర్‌లో పెరుగుతున్న కోవిడ్‌ -19 కేసులు

Singapore

Singapore

Singapore:ప్రపంచాన్ని గడగడ వణించిన కరోనా మరో మారు తిరిగబెట్టిందా అంటే అవుననే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల సింగపూర్‌లో కోవిడ్‌ -19 కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నెల 5 నుంచి 11 వరకు చూస్తే ఏకంగా 25,900 కేసులు పెరిగిపోయాయి. అంతకు ముందు వారం 13,700 కేసులు నమోదు అయ్యాయి. కాగా పరిస్థితిని సింగపూర్‌ ప్రభుత్వం క్షుణ్ణంగా గమనిస్తోంది. కేసులు గణనీయంగా పెరిగిపోవడంతో వైద్య ఆరోగ్యమంత్రి ఓంగ్‌ యే కుంగ్‌ దేశ ప్రజలను తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సలహా ఇచ్చారు.

కరోనా వేవ్‌పై అధ్యయనం..(Singapore)

సింగపూర్‌ హెల్త్‌ మినిస్ర్టీ కొత్త కరోనా వేవ్‌పై అధ్యయనం చేస్తోందని తెలిపింది. ఇటీవల కాలంలో సింగపూర్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా కొత్త కోవిడ్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య రోజుకు 181 నుంచి ప్రస్తుతం 250కు చేరాయి. ఆస్పత్రిలో బెడ్‌ల సంఖ్య పెంచేందుకు అత్యవసరం కానీ కేసులు తగ్గించుకోని ఇతర ఆస్పత్రులకు బదిలీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం సింగపూర్‌లో కోవిడ్‌ -19 కేసులు ప్రారంభం దశలో ఉన్నాయి. క్రమంగా పెరిగే అవకాశాలుకనిపిస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్ర్టెయిట్‌ టైమ్స్‌కు చెప్పారు. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో జూన్‌ రెండవ వారం లేదా నెలాఖరు నాటికి కోవిడ్‌ కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

60 ఏళ్లు పైబడిన వారికి అదనపు వ్యాక్సిన్..

హై రిస్క్‌ కలిగిన వారు అంటే 60 ఏళ్లు లేదా అంతకంటే వయసు పైబడిన వారికి అదనంగా కోవిడ్‌ -19 వ్యాక్సిన్‌ ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గత 12 నెలల నుంచి వ్యాక్సిన్‌ తీసుకోకుంటే వారు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ప్రోత్సహిస్తారు. ఇక సోషల్‌ డిస్టెన్స్‌ గురించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కేవలం సింగపూర్‌ వరకు మాత్రమే పరిమితం కాబట్టి సోషల్‌ డెస్టెన్స్‌ లాంటి నిబంధనలు అమలు చేయడం లేదని చెప్పారు. ఒక వేళ పరిస్థితులు అదుపు దాటితే చివరి అస్ర్తంగా అప్పుడు సోషల్‌ డిస్టెన్స్‌ అమలు చేస్తామన్నారు. కోవిడ్‌ -19తో కలిసి సహజీవనం చేయాల్సిందేనని ప్రభుత్వం కూడా అంటోంది. ప్రతి ఏడాది ఇలాంటివి ఒకటి లేదా రెండు వేవ్‌లు వస్తూనే ఉంటాయన్నారు ఓంగ్‌.

Exit mobile version