Tangaraju: భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్యను సింగపూర్ ప్రభుత్వం ఉరి తీసింది. గంజాయి అక్రమ రవాణా కేసులో.. శిక్ష అనుభవిస్తున్న తంగరాజుకు అక్కడి ప్రభుత్వం ఉరి శిక్ష విధించింది. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తిని ఉరితీయడం ఇది రెండోసారి.
ఎవరి తంగరాజు.. (Tangaraju)
భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్యను సింగపూర్ ప్రభుత్వం ఉరి తీసింది. గంజాయి అక్రమ రవాణా కేసులో.. శిక్ష అనుభవిస్తున్న తంగరాజుకు అక్కడి ప్రభుత్వం ఉరి శిక్ష విధించింది. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తిని ఉరితీయడం ఇది రెండోసారి.
భారత సంతతికి చెందిన తంగరాజు.. మరణశిక్షను తగ్గించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వడంతో అతడు ఉరికంబం ఎక్కాల్సి వచ్చింది. ఈ మరణ శిక్షపై అంతర్జాతీయంగా పలు దేశాలు వ్యతిరేకించాయి. అయినప్పటికి సింగపూర్ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు.
తంగరాజు సుప్పయ్య డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో 2014లో అరెస్టయ్యాడు. ఒక కిలో గంజాయి అక్రమంగా తరలిస్తున్నాడనే కారణంతో అతడిని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో తంగరాజుకు అక్టోబర్ 9, 2018లో మరణశిక్ష విధించింది అక్కడి కోర్టు.
మరో ఇద్దరితో కలిసి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరించినట్లు న్యాయస్థానం నిర్దారించింది.
డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో భారత సంతతి వ్యక్తిని ఉరితీయడం ఇది రెండోసారి.
ఈ మరణ శిక్షపై.. తీవ్ర విమర్శలు వచ్చాయి. యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు వ్యతిరేకించాయి.
కానీ సింగపూర్ వీటిని ఖండించింది. స్థానిక చట్టాల ప్రకారమే ఉరిశిక్ష అమలు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.
బుధవారం తెల్లవారుజామున.. ఉరిశిక్షను అమలు చేశారు. చాంగి జైలులో తంగరాజును ఉరి తీసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం తంగరాజు వయస్సు 46 ఏళ్లు.
మాదక ద్రవ్యాల సరఫరాకు సింగపూర్ లో కఠినమైన చట్టాలు ఉన్నాయి.
మాదక ద్రవ్యాలను తమ దేశంలో సరఫరా చేసే వారికి సింగపూర్ గరిష్ఠంగా ఉరిశిక్ష విధిస్తుంది. కొరియర్స్‌కు కాస్త చిన్న శిక్షలు విధిస్తుంది.
ఈ డెలివరీని కోఆర్డినేట్ చేసింది తంగరాజుదేననే ప్రాసిక్యూషన్ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకొంది. దీనివల్ల ఆయనకు శిక్ష తగ్గే అవకాశం లేకుండా పోయింది.