Site icon Prime9

Viral: 53 సార్లు పెళ్లి చేసుకున్నాడు. మనశ్శాంతి కోసమే తప్ప.. మరొకటి కాదట..

Saudi-man-married-53-times

Cairo: సౌదీకి చెందిన ఒక వ్యక్తి తాను 53 సార్లు వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. తన లక్ష్యం స్థిరత్వం మరియు మనశ్శాంతేనని వ్యక్తిగత ఆనందం కాదని చెబుతున్నాడు. ఈ శతాబ్దపు బహుభార్యాత్వవేత్త” అనే నిక్ నేమ్ ఉన్న 63 ఏళ్ల అబు అబ్లుల్లా అనే వ్యక్తి సౌదీ వ్యక్తి ఎంబిసి టెలివిజన్ చానెల్ తో మాట్లాడుతూ తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పాడు. నేను మొదటి సారి వివాహం చేసుకున్నప్పుడు, నేను సుఖంగా ఉన్నందున నేను ఒకటి కంటే ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవాలని అనుకోలేదని చెప్పాడు. అయితే కొంతకాలం తర్వాత, సమస్యలు వచ్చాయి. నేను 23 సంవత్సరాల వయస్సులో మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని నా భార్యకు తెలియజేసాను. తర్వాత తన మొదటి మరియు రెండవ భార్యల మధ్య సమస్య తలెత్తిందని అది మూడు మరియు నాల్గవ పెళ్లికి తనను ప్రేరేపించిందని అతను చెప్పాడు. తర్వాత మొదటి, రెండో, మూడో భార్యలకు విడాకులు ఇచ్చానని అబూ అబ్దుల్లా తెలిపాడు.

“నా వివాహాలు చాలా వరకు సౌదీ స్త్రీలతో జరిగాయి. విదేశీ వ్యాపార పర్యటనల సమయంలో మూడు నాలుగు నెలలు ఉండేవాడిని. ఆ సమయంలో విదేశీ మహిళలను కూడా వివాహం చేసుకున్నానని చెప్పాడు. అతని మొదటి వివాహం 20 ఏళ్ల వయసులో జరిగిందని అపుడు తన భార్య తనకంటే ఆరేళ్ల పెద్దదని తెలిపాడు. ఇస్లాం ఒకే సమయంలో నలుగురు భార్యలను వివాహం చేసుకోవడానికి అనుమతిస్తుంది.

అబు వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో సంచలనం కలిగించింది. అక్కడ కొందరు అతనితో ఇంటరాక్ట్ చేసి అతనిని ప్రశంసించారు. మరికొందరు అతను చేసినది గర్వించదగినది కాదని విమర్శించారు. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 8,50,000 సార్లు చూసారు.

Exit mobile version