Russia-Ukraine war: పుతిన్‌పై ఉక్రెయిన్ హత్యాయత్నం చేసిందని ఆరోపించిన వెంటనే దాడుల జోరును పెంచింది. దీంతో రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రెండు దేశాలూ పోటాపోటీగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి రష్యా అధ్యక్ష భవనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా.. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ పై క్రెమ్లిన్ సైన్యం విరుచుకుపడింది. నగరంపై బాంబుల వర్షం కురిపించింది. ఓ సూపర్ మార్కెట్‌తోపాటు రైల్వే స్టేషన్‌పై మిస్సైల్‌తో దాడి చేసింది. ఈ దాడిలో 21 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది. ఈ ఉదయం కీవ్ లో కూడా రెండు భారీ పేలుళ్లు సంభవించినట్లు ఉక్రెయిన్ మీడియా వెల్లడించింది.
ప్రజలు ఎవరూ బయటకు రావద్దు..(Russia-Ukraine war)
కాగా, రష్యా దాడులను తిప్పికొట్టేందుకు పోరాడుతున్నట్లు కీవ్ సిటీ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. రష్యా మరిన్ని దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని.. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. ఈ మేరకు కీవ్ నగరంలో ఎయిర్ రైడ్ అలర్ట్ జారీ చేసింది. రాజధానితో పాటు ఖేర్సన్, చెర్నిహివ్, సుమీ, పోల్టోవా, కిరోవోహ్రాద్, ఖార్కివ్, మికొలైవ్, ఒడెస్సా, ద్నిప్రొపెట్రోవ్స్క్, జపొరిజియా రీజియన్లలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
డ్రోన్ అటాక్ నేపథ్యంలోనే..
కాగా, రష్యా అధ్యక్ష భవనంపై డ్రోన్ అటాక్ నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపారు. అయితే, క్రెమ్లిన్ పై డ్రోన్ దాడికి తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు. తమ సరిహద్దుల్లో రష్యా చేస్తున్న దాడులను ఎదుర్కొంటున్నామని, సరిహద్దుల్లోని తమ ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధికారులు వివరించారు.