Site icon Prime9

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తానా సభ్యుడి ఇంటి విషాదం

road-accident-in-america

road-accident-in-america

America: అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగువారు చనిపోయారు. మృతులు తానా బోర్డు సభ్యుడి కుటుంబ సభ్యులుగా గుర్తించారు. సమాచారం మేరకు, కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ 1995 నుండి అమెరికాలో ఉంటున్నారు. హ్యోస్టన్ లో వైద్యుడిగా స్ధిరపడ్డారు. ఆయనకు భార్య వాణిశ్రీ ఐటి ఉద్యోగిగా, కుమార్తెలు ఇరువురు విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో టెక్సాస్, వాలర్ కౌంటీ మీదుగా వెళ్లుతున్న వారి వాహనం ఎఫ్.ఎమ్ 2920 రోడ్డు మార్గంలో ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న నాగేంద్ర భార్య, పెద్ద కుమార్తెలు ఇరువురు మృతి చెందారు.

2017 నుండి నాగేంద్ర తానా సభ్యుడిగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకొన్న నాగేంద్ర శ్రీనివాస్ షాక్ లోకి వెళ్లారు. ఘటనపై తానా సభ్యులు సంతాపం తెలియచేశారు. ప్రమాదం పై పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: లైవ్ లో ప్రారంభమైన సుప్రీం కోర్టు విచారణ

Exit mobile version