Rishi Sunak: బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సునాక్‌కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ రెండు సీట్లు కోల్పోయింది. అయితే బ్రిటన్ పార్టమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ కూడా కీలకమైన సీటును కన్సర్వేటివ్ పార్టీకి అప్పగించుకుంది. మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పాత నియోజకవర్గం నుంచి కన్సర్వేటివ్ పార్టీ గెలిచి పరువు కాపాడుకుంది.
పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రధానమంత్రి రిషి సునాక్ అన్నీ రంగాల్లో విఫలం అయ్యారని ప్రతిపక్ష లేబర్ పార్టీ గట్టిగా ప్రచారం చేసి విజయం సాధించింది. రెండవ ప్రపంచ యుద్దం తర్వాత కన్సర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంటరీ స్థానాలు సెల్బీ, ఎనెస్టీని లేబర్‌పార్టీ కైవసం చేసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో రిషి సునాక్ చెందిన కన్సర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చవి చూసింది. అయితే మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గతంలో పోటీ చేసిన స్థానంలో కేవలం 500 ఓట్ల మెజారిటితో గెలిచి పరువు నిలుపుకున్నారని చెప్పుకోవచ్చు.
ఆర్దికంగా కుదేలయిన బ్రిటన్..(Rishi Sunak)
ప్రస్తుతం బ్రిటన్ ఆర్థికంగా కుదేలైంది. బ్రిటన్ పౌరులు అధిక ద్రవ్యోల్బణంతో సతమవుతున్నారు. పెరిగిపోతున్న పన్నులు.. ఇంటి వడ్డీరేట్లు.. పారిశ్రామిక అశాంతి, ప్రజలు వైద్య సేవల కోసం దీర్ఘకాలం పాటు వేచి చూడాల్సిన పరిస్థతి. దేశంలోని ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఒక నివేదికలో దేశంలోని సగంపైనే జనాభా ఒంటిపూట తిండికి నోచుకోలేకపోతున్నారని వెల్లడించింది. గత 15 సంవత్సరాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందగా నిలిచింది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ఒక వైపు.. మరో వైపు ఉద్యోగుల జీత భత్యాలు మాత్రం పెరగడం లేదు. దీనితో దేశంలోని అన్నీ రంగాలు డాక్టర్ల నుంచి ట్రెయిన్ డ్రైవర్ల వరకు వేతనాలు పెంచాలని రోడ్డెక్కారు.
దేశంలో జరిగిన ఒపినీయన్ పోల్స్‌లో ప్రతిపక్షలేబర్ పార్టీలో పోల్చుకుంటే సునాక్‌కు చెందిన కన్సర్వేటివ్ పార్టీ 20 పాయింట్లతో వెనుకబడింది. వరుసగా ఐదో సారి అధికార కన్సర్వేటివ్ పార్టీ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది. మరో పక్క లేబర్‌పార్టీ రెండు స్థానాల్లో గెలిచి ఒక స్థానంలో ఓడిపోయినంత మాత్రాన వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గంపగుత్తగా ఓట్లు పడతాయని భావించలేమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బ్రిటన్‌లో జనవరి 2025లో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే హంగ్ పార్లమెంటు ఏర్పడే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.