Site icon Prime9

Rishi Sunak: రిషి సునక్ కింగ్ చార్లెస్ III కంటే ధనవంతుడు

Rishi Sunak

Rishi Sunak

London: బ్రిటన్ యొక్క 57వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రిషి సునక్ కింగ్ చార్లెస్ III కంటే ధనవంతుడు. 42 సంవత్సరాల సునక్ మొదటి హిందూ ప్రధాన మంత్రి. అతను 1980లో సౌతాంప్టన్‌లో తూర్పు ఆఫ్రికా నుండి యూకేకి వెళ్లిన భారతీయ తల్లిదండ్రులకు జన్మించాడు. సునక్ ఒక ప్రైవేట్ బోర్డింగ్ స్కూల్, వించెస్టర్ కాలేజీలో చదువుకున్నాడు. దీనికి హాజరు కావడానికి సంవత్సరానికి 43,335 పౌండ్లు ఖర్చవుతాయి.

సునక్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో రాజకీయాలు, తత్వశాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రాలను అభ్యసించారు. అతనికి ఫస్ట్ క్లాస్ డిగ్రీ లభించింది. అతను తరువాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబిఏపట్టా పొందాడు. అక్కడ అతను తన కాబోయే భార్య అయిన అక్షతా మూర్తిని కలుసుకున్నాడు. అక్షతామూర్తి, సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌ను స్థాపించిన భారతీయ బిలియనీర్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి కుమార్తె. ఆమె ఈ కంపెనీలో 0.91 శాతం వాటాను కలిగి ఉంది. దీని విలువ దాదాపు 700 మిలియన్ పౌండ్లు. ఈ జంట 2009లోబెంగళూరులో వివాహం చేసుకున్నారు. వీరికి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సునక్ మరియు మూర్తిల ఉమ్మడి సంపద 730 మిలియన్ పౌండ్లుగా అంచనా వేయబడింది. ఇది కింగ్ చార్లెస్ III మరియు క్వీన్ కన్సార్ట్ కెమిల్లా యొక్క అంచనా సంపద 300 మిలియన్-350 మిలియన్ పౌండ్ల కంటే రెట్టింపు.

Exit mobile version