Red King Kobra : ప్రతిఒక్కరు తరచుగా పాములను చూస్తూనే ఉంటారు.ఐతే మనం చూసే పాములు తెల్లటి లేదా నల్లటి రంగు గల పాములను చూస్తుంటాము.చాలా అరుదుగా ఆకుపచ్చ రంగులో ఉండే పామును చూస్తాము.ఐతే మీరు ఎప్పుడైనా ఎర్రటి రంగులో ఉండే పామును చూశారా. సినిమాల్లో కూడా ఎర్ర రంగు పామును ఎవరూ కూడా చూసుండరు.ఎర్ర రంగు పాము ఉంటుందని కూడా మనలో చాలా మందికి తెలియదు. కానీ ఎర్ర రంగు పాము కూడ ఉంది.అరుదైన జాతికి చెందిన ఈ పాములు ఎక్కువగా వియత్నాంలో ఉన్నాయి అంట.ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.
ఆగ్నేయాసియా దేశం వియత్నాం.అక్కడ బీచ్‌లు, నదులు, బౌద్ధ గోపురాలు మరియు సుందర నగరాలకు వియత్నాం ప్రసిద్ధి.అక్కదా నదులు, అడవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ఇక్కడ అరుదైన జాతులకు చెందిన పాములు కూడా ఎక్కువుగానే ఉంటాయి.అరుదైన జాతికి చెందిన ఎర్ర రంగు పాములు కూడా వియత్నాంలో ఉన్నాయి. ‘స్నేక్ క్యాచర్స్’ అనే యూట్యూబ్ ఛానెల్లో ఎర్ర రంగు కోబ్రాకు సంబందించిన వీడియోను అప్లోడ్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.