Site icon Prime9

Nithyananda: అనారోగ్యంతో ఉన్నాను.. చికిత్సకు అనుమతించండి. శ్రీలంకకు నిత్యానంద లేఖ

Nithyananda

Nithyananda: స్వయం ప్రకటిత దైవం స్వామి నిత్యానంద ఆరోగ్య సమస్యల కారణంగా శ్రీలంకలో ఆశ్రయం పొందాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు శ్రీలంక ప్రభుత్వానికి లేఖరాసారు. తాను స్దాపించిన కైలాస దేశంలో వైద్యసదుపాయాలు లేవని తనకు తీవ్ర అనారోగ్యంగా ఉన్నందున శ్రీలంకలో వైద్యచికిత్సకు అనుమతించాలంటూ లేఖలో పేర్కొన్నారు.

చాలా వారాలుగా, నిత్యానంద ‘లోతైన సమాధి’లో ఉన్నారని, అందుకే పూజలకు కనిపించడం లేదని అతని ఆశ్రమంలోని సోషల్ మీడియా పేజీలు పేర్కొంటున్నాయి. నిత్యానందను ఎయిర్ అంబులెన్స్ ద్వారా విమానంలో తరలిస్తామని, చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేసి తీసుకువస్తామని తెలిపారు. శ్రీలంకలో అన్ని వైద్య ఖర్చులను భరిస్తాము. దీనికి బదులుగా మిలియన్ల డాలర్ల విలువైన ఆ వైద్య పరికరాలను మీ దేశ ప్రజల ప్రయోజనం కోసం వదిలివేస్తామని లేఖలో పేర్కొన్నారు.

నిత్యానంద ఒక మహిళా శిష్యురాలు ఆశ్రమంలో ఉన్న సమయంలో దాదాపు ఐదేళ్ల పాటు ఆధ్యాత్మిక ముసుగులో ఆమె పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిత్యానంద పై అతని మాజీ డ్రైవర్ లెనిన్ ఫిర్యాదు మేరకు 2010లో అత్యాచారం కేసు నమోదైంది. నిత్యానందను అరెస్టు చేసి బెయిల్‌ పై విడుదల చేశారు. 2020లో నిత్యానంద దేశం విడిచి పారిపోయాడంటూ లెనిన్‌ వేసిన పిటిషన్‌పై బెయిల్‌ను రద్దు చేశారు. నిత్యానంద దేశం విడిచి వెళ్లి కైలాసం అని పిలిచే ప్రదేశంలో తన ఆశ్రమాన్ని స్థాపించాడని నమ్ముతారు.

Exit mobile version