Professor Harassment: యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక కళాశాల ప్రొఫెసర్ మహిళా విద్యార్థినులను వారి షర్టులను తీసివేయమని కోరినందుకు ఉద్యోగం నుండి తొలగించబడ్డారు. ఈ ఘటనలో విద్యాశాఖ పరిధిలోని పౌరహక్కుల కార్యాలయం విచారణ అనంతరం ఈ చర్య తీసుకుంది.
తరగతి ప్రదర్శనలో భాగంగా సుమారు 11 మంది విద్యార్థినులకు తమ షర్టులను తొలగించాలని సూచించడం ద్వారా ప్రొఫెసర్ ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించారని మూడు నెలల సుదీర్ఘ విచారణలో వెల్లడైంది. అతను వారి రొమ్ముల గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేసాడు, ఇది మెడికల్ అసెస్‌మెంట్‌కు సంబంధించినదని పేర్కొన్నాడు కొంతమంది మహిళా విద్యార్థినులు ల్యాబ్ జాకెట్లు ధరించినప్పుడు, ప్రొఫెసర్ వాటిని తొలగించమని పట్టుబట్టారు. ఈ సంఘటన టకోమా/సిల్వర్ స్ప్రింగ్ క్యాంపస్‌లో జరిగింది .విచారణ తర్వాత, సదరు ప్రొఫెసర్ ను వెంటనే అడ్మినిస్ట్రేటివ్ లీవ్‌లో ఉంచి తరువాత తొగించారు.
మోంట్‌గోమేరీ కళాశాల ప్రతినిధి సమగ్ర విచారణకు కృతజ్ఞతలు తెలిపారు. విచారణలో, పాల్గొన్న విద్యార్థినులలో ఒకరు కోర్సులో ఫెయిల్ అయినట్లు కనుగొన్నారు. ఇది వేధింపుల కారణంగా జరిగిందని భావిస్తున్నారు. తిరిగి నమోదు చేసుకోవడంలో కళాశాల ఆమెకు సహాయం చేసింది. ఆమె మళ్లీ తరగతికి వెళ్లేందుకు అయ్యే ఖర్చులను భరించింది. అదనంగా, కళాశాల ట్యూషన్ రీయింబర్స్‌మెంట్‌ను అందించింది. అదే తరగతిలోని కనీసం ముగ్గురు విద్యార్థులకు కోర్సును తిరిగి పొందేందుకు అయ్యే ఖర్చులకు సాయం చేసింది.