Brazil: బ్రెజిల్ లోని మూడు రాష్ట్రాల్లో పోలీసులు ప్రారంభించిన మాదకద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా జరిగిన అనేక దాడుల్లో 43 మంది మరణించారు. రియో డి జెనీరోలోని కాంప్లెక్సో డా పెన్హా ప్రాంతంలో బుధవారం తిరిగి కాల్పులు జరిపగా పది మంది మరణించారని, మరో నలుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
385 కిలోల మాదక ద్రవ్యాల స్వాధీనం..(Brazil)
గ్వారూజా తీరప్రాంత నగరంలో గత వారం ప్రత్యేక దళాల పోలీసు అధికారి మరణించిన తర్వాత సావో పాలోలో ఆపరేషన్ ప్రారంభమై 58 మందిని అరెస్టు చేసినట్లు బీబీసీ నివేదించింది. ఆపరేషన్ షీల్డ్‌లో భాగంగా సావో పాలోలో ఐదు రోజులపాటు పోలీసులు జరిపిన దాడిలో కనీసం 14 మంది మరణించారు. అదనంగా, గత వారం శుక్రవారం నుండి ఈశాన్య రాష్ట్రమైన బహియాలో 19 మంది అనుమానితులను చంపారు.ఇదిలా ఉండగా, ఘర్షణల సమయంలో మరణించిన 14 మందిలో ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారని సావో పాలో రాష్ట్ర గవర్నర్ టార్సిసియో డి ఫ్రీటాస్ తెలిపారు. 385 కిలోల మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
రియో డి జెనీరోలోని కాంప్లెక్సో డా పెన్హాలో ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా నాయకులతో సమావేశం కావాలని నిఘా నివేదికలు సూచించడంతో ఆపరేషన్ ప్రారంభించబడింది. ఈ ఘర్షణల్లో మాదక ద్రవ్యాల రవాణా కింగ్‌పిన్, ట్రాఫికర్ సహా 10 మంది మృతి చెందారు.బహియాలో, పోలీసులు మరియు ముఠా సభ్యుల మధ్య శుక్రవారం నుండి సాల్వడార్, ఇటాటిమ్ మరియు కమకారి అనే మూడు నగరాల్లో ఘర్షణలు జరిగాయి. ఇటాలిమ్‌లో ఎనిమిది మంది, కమాకారీలో ఏడుగురు, సాల్వడార్‌లో నలుగురు మరణించారు. మూడు ఆపరేషన్లలో తుపాకులు, ఫోన్లు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.