Site icon Prime9

Pink Star Diamond: ఈ పింక్ స్టార్ డైమండ్ వజ్రాల రారాజు.. ఎందుకో తెలుసా..?

pink star diamond

pink star diamond

Pink Star Diamond: వజ్రాలంటేనే అధిక ధరలు ఉంటాయని తెలుసు కానీ ఆ ఒక్క డైమెండ్ మాత్రం వజ్రాలకే రారాజుగా నిలిచింది. హాంకాంగ్‌లో శుక్రవారం నిర్వహించిన వజ్రాల వేలంలో పింక్ స్టార్ డైమండ్ అత్యధికంగా రూ. 412.29 కోట్లు పలికింది. 11.5 క్యారెట్ల బరువున్న విలియమ్‌సన్‌ పింక్‌ స్టార్‌ డైమండ్‌ను సోథ్బైస్‌ హాంకాంగ్‌ సంస్థ వేలంలో పెట్టింది.

కాగా ఇది రూ.172 కోట్ల ధర పలుకుతుందని కంపెనీ అంచనా వెయ్యగా అందుకు భిన్నంగా వారి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా 412 కోట్లకు పైగా ధర పలికింది. కానీ, కంపెనీ నిర్వాహకుల అంచనాలకు మించి ధర పలకడంతో వారు ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద మొత్తంలో ధర పలికిన రెండో డైమండ్‌ గా ఇది చరిత్ర సృష్టించింది. 2017లో వేలం వేసిన 59.60 క్యారెట్ల పింక్‌ స్టార్‌ డైమండ్‌ రూ. 587.84 కోట్ల ధర పలికింది. మొట్టమొదటి 23.60 క్యారెట్ల విలియమ్‌సన్‌ డైమండ్‌ను 1947లో బ్రిటన్‌ రాణి దివంగత క్వీన్‌ ఎలిజబెత్‌- 2 పెళ్లికి బహుమతిగా ఇచ్చారు.

ఇదీ చదవండి: వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు.. నెట్టింట సమంత పోస్ట్ వైరల్

 

Exit mobile version