Site icon Prime9

South Korea plane: దక్షిణ కొరియాలో గాల్లో ఉండగానే విమానం డోర్‌ తెరిచిన ప్రయాణికుడు

South Korea plane

South Korea plane

South Korea plane: ద‌క్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ను ఓ ప్యాసింజెర్ తెరిచాడు. దీనితో విమానం లోపల భారీ గాలి ప్రకంపనలు వచ్చాయి. ఆ స‌మ‌యంలో విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది విమానాన్ని డేగూ విమానాశ్రయంలో దించారు.

వైరల్ అయిన వీడియో.. (South Korea plane)

ఈ సంఘటన ఆసియానా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A321 విమానంలో జరిగింది. కొంతమంది తోటి ప్రయాణీకులు వ్యక్తిని తలుపు తెరవకుండా ఆపడానికి ప్రయత్నించారు, కానీ చివరికి అది పాక్షికంగా తెరవబడింది.ద‌క్షిణ దీవి జేజూ నుంచి డేగూ వెళ్తున్న విమానంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. విమానంలో ఉన్న వ్యక్తి తీసిన వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది, ఇది వైరల్ అయ్యింది,ఈ ఘటనతో విమానంలో ఉన్న 194 మంది భయభ్రాంతులకు లోన‌య్యారు. అయితే ఎంత సేపు డోర్ ఓపెన్ చేశార‌న్న అంశంపై క్లారిటీ లేదు. డోర్ ఓపెన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎందుకు అత‌ను అలా చేశాడో ఇంకా నిర్దార‌ణ కాలేదు. ఉల్సన్‌లో జ‌రుగుతున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు చాలా మంది అథ్లెట్లు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. శ్వాస కోస ఇబ్బందులు త‌లెత్తిన్న ప్రయాణికుల‌ను ఆస్పత్రికి త‌ర‌లించిన‌ట్లు ర‌వాణాశాఖ వెల్లడించింది.

Exit mobile version