Site icon Prime9

Pakistan International Airlines: నిలిచిపోయిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ( పీఐఏ ) విమాన సర్వీసులు.. ఎందుకో తెలుసా?

Pakistan International Airlines

Pakistan International Airlines

 Pakistan International Airlines:పాకిస్తాన్ ప్రభుత్వ విమానయాన సంస్థ, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ( పీఐఏ ) పలు విమానాలను నిలిపివేసింది. తన 13 లీజు విమానాలలో కూడా ఐదు విమానాల సర్వీసులను నిలిపివేయగా మరో నాలుగు విమానాల సర్వీసులు కూడా నిలిపోనున్నాయని సమాచారం.

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ఆర్దికసంక్షోభంలో ఉంది. రుణదాతలు, విమానాల అద్దెదారులు, ఇంధన సరఫరాదారులు, బీమా సంస్థలు, అంతర్జాతీయ మరియు దేశీయ విమానాశ్రయ ఆపరేటర్లు మరియు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్  కి ఇది పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉందని పాకిస్థానీ వార్తాపత్రిక డాన్ నివేదించింది.ప్రస్తుతం పీఐఏ కొన్ని నెలలపాటు కార్యకలాపాలను నిర్వహించడానికి పరిమిత నిధులను మాత్రమే కలిగి ఉంది. త్వరలోనే పీఐఏ ఆస్తులను అధికారులు అమ్మకానికి ఉంచుతారని సమాచారం.బోయింగ్ మరియు ఎయిర్‌బస్‌లు సెప్టెంబర్ మధ్య నాటికి విడిభాగాల సరఫరాను నిలిపివేసే దశలో ఉన్నాయని విమానయాన మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి తెలిపింది. దేశీయ ఏజెన్సీలకు సుంకాలు, పన్నులు మరియు సేవా ఛార్జీలను సస్పెండ్ చేస్తూ 23 బిలియన్ల విలువైన నిధులను పొందాలని విమానయాన మంత్రిత్వ శాఖ కోరింది. మొత్తం పునర్నిర్మాణ ప్రక్రియకు మరిన్ని నెలలు పట్టవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే విమానయాన మంత్రిత్వ శాఖ తన ప్రతిపాదనకు మద్దతు ఇవ్వడానికి ఆచరణీయమైన ప్రణాళికను సమర్పించలేదని నివేదిక  తెలిపింది.

745 బిలియన్ల అప్పులు..( Pakistan International Airlines)

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో ప్రభుత్వానికి 92% వాటా ఉంది. ఈ సంస్దకు 745 బిలియన్ రూపాయల అప్పులు ఉన్నాయి. దాని మొత్తం ఆస్తుల విలువ కంటే అప్పులు ఐదు రెట్లు ఎక్కువ అని పాకిస్తాన్ విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.పరిస్థితి ఇలాగే కొనసాగితే పీఐఏ రుణాలు మరియు బాధ్యతలు రూ.1,977 బిలియన్లకు పెరుగుతాయి. 2030 నాటికి వార్షిక నష్టాలు సంవత్సరానికి రూ.259 బిలియన్లకు పెరుగుతాయని విమానయాన మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. పాకిస్తాన్ విమానాలు కూడా బకాయిలు చెల్లించనందుకు విమానాశ్రయాలలో జప్తు చేయబడ్డాయి. సౌదీ అరేబియా ఎయిర్‌పోర్ట్ అథారిటీ కూడా 8.2 మిలియన్ రియాల్స్ బకాయి మొత్తాన్ని చెల్లించమని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు తెలిపింది.

Exit mobile version