Site icon Prime9

Pakistan International Airlines: ఇంధన సంక్షోభం.. 48 విమానాలను రద్దు చేసిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)

Pakistan International Airlines

Pakistan International Airlines

Pakistan International Airlines: పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఇంధనం అందుబాటులో లేని కారణంగా దేశీయ మరియు అంతర్జాతీయ మార్గాలలో 48 విమానాలను రద్దు చేసింది. పీఐఏ ప్రతినిధి రోజువారీ విమానాలకు పరిమిత ఇంధన సరఫరా మరియు కార్యాచరణ సమస్యల కారణంగా విమానాలు రద్దు చేయబడ్డాయి. మరి కొన్ని విమానాలు రీషెడ్యూల్ చేయబడ్ధాయని అధికార ప్రతినిధి తెలిపారు.

ఆర్దికసాయానికి నిరాకరించిన ప్రభుత్వం..(Pakistan International Airlines)

రద్దు చేయబడిన విమానాల ప్రయాణికులను ప్రత్యామ్నాయ విమానాలకు మార్చారు. ప్రయాణీకులకు వారి విమాన స్థితిని తనిఖీ చేయడానికి విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందు పీఐఏ కస్టమర్ కేర్, పీఐఏ కార్యాలయాలు లేదా వారి ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించింది. పీఐఏ బుధవారం డజనుకు పైగా విమానాలను రద్దు చేసింది.ప్రభుత్వ యాజమాన్యంలోని పాకిస్తాన్ స్టేట్ ఆయిల్ (PSO) బకాయిలు చెల్లించని కారణంగా సరఫరాను నిలిపివేయడం వల్ల పీఐఏ విమానాలకు ఇంధన కొరత ఏర్పడింది. పేరుకుపోయిన అప్పుల కారణంగా ప్రైవేటీకరణ దిశగా పయనిస్తున్న విమానయాన సంస్థ భవిష్యత్తు అస్పష్టంగానే ఉంది. నిర్వహణ ఖర్చులకు మద్దతుగా రూ. 23 బిలియన్లను అందించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిరాకరించడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది.

ఇంధనం కోసం రోజుకు రూ.100 బిలియన్లు అవసరమవుతాయి. అయితే ముందస్తు నగదు చెల్లింపులను మాత్రమే డిమాండ్ చేయడంతో, ఎయిర్‌లైన్ ఈ అవసరాన్ని తీర్చలేకపోయింది.పాకిస్థాన్ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 21.3 శాతానికి చేరుకుంది. గత ఏడాది కాలంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి విలువ దాదాపు సగం కోల్పోయింది. దేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు $10 బిలియన్ల వద్ద అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నాయి. సెప్టెంబరులో, దేశ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 దాటాయి. ప్రధానమంత్రి అన్వారుల్ హక్ కకర్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గురువారం పెట్రోల్ మరియు హై-స్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి) ధరలను లీటరుకు రూ.14.91 మరియు రూ.18.44 చొప్పున పెంచింది.

పెంపుతో పెట్రోల్ ధర రూ.305.36గా ఉండగా, డీజిల్ ధర రూ.311.84కి చేరింది.పెరుగుతున్న కరెంటు బిల్లులపై పాకిస్థాన్‌లో కూడా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ముల్తాన్, లాహోర్, కరాచీ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)తో సహా పలు ప్రాంతాల్లో ప్రజలు నిరసనలకు దిగారు. విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతోనూ వారు వాగ్వాదానికి దిగారు.

 

Exit mobile version