Vietnam: వియత్నాం రాజధాని హనోయిలోని తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 50 మందికి పైగా మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. బుధవారం ఉదయం వరకు అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
అపార్టుమెంట్లో 45 ఇళ్లు ..(Vietnam)
రాత్రి 11:30 గంటలకు చాలా మంది నివాసితులు ఇంట్లో ఉన్నప్పుడు మంటలు చెలరేగాయని తెలుస్తోంది .45 గృహాలు నివసించే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ ఇరుకైన సందులో ఉండటంతో అక్కడికి చేరుకోవడానికి అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడ్డారు. అగ్నిమాపక వాహనాలను భవనానికి 300 నుంచి 400 మీటర్ల దూరంలో నిలిపి ఉంచాల్సి వచ్చింది. రెస్క్యూ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.