Site icon Prime9

Papua New Guinea: పపువా న్యూ గినియాలో కొండచరియలు విరగిపడి 300 మంది మృతి

Papua New Guinea

Papua New Guinea

Papua New Guinea:పపువా న్యూ గినియాలో కొండచరియలు విరగిపడి సుమారు 300 మంది సమాధి అయినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. కాగా రెస్యూ వర్కర్లు మట్టి పెళ్లలో కూరుకుపోయిన వారిని వెలికి తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొండచరియలు విరిగిపడి జాతీయ రహదారిపైపడ్డంలో సహాయచర్యలకు ఆటంకం కలుగుతోంది. దీంతో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లడానికి హెలికాప్టర్ల ద్వారా వెళ్లాల్సి వస్తోంది. పావువా న్యూ గినియా కొండ ప్రాంతంలో సహాయ బృందం చేరుకుని గ్రామస్తులను కాపాడ్డంతో పాటు మట్టి పెళ్లలో కూరుకుపోయిన వారిని వెలికితీయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.

నాలుగు మృతదేహాలు వెలికితీత..(Papua New Guinea)

ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డంతో సుమారు 300 కంటే ఎక్కువ మంది మట్టిలో కూరుకుపోయి ఉంటారని శనివారం నాడు కమ్యూనిటి లీడర్‌ మార్క్‌ఇపుయా చెప్పారు. ఇప్పటి వరకు నాలుగు మృత దేహాలను వెలికి తీశారని యునైటెడ్‌ నేషన్స్‌ అధికారి పావువా న్యూ గినియా రాజధాని పోర్ట్‌ మోర్స్‌బీ లో చెప్పారు. ఇదిలా ఉండగా ఎంగా ప్రావిన్స్‌లోని కావోకాలామ్‌ గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామును గ్రామస్తులు గాడనిద్రలో ఉన్నసమయంలో కొండచరియలు విరిగిపడ్డాయని ప్రభుత్వ అధికారాలు తెలిపారు. పావువా న్యూ గినియా మీడియా సమాచారం ప్రకారం కొండచరియలు విరిగిపడి 1,182 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతానికి సహాయ బృందాలు వెళ్లాడనానికి కూడా వీలు కాకుండా ఉంది. కాగా గ్రామస్తులు కొండకింద ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. అయితే ఇక్కడ భూమి తరచూ కుంగడంతో పాటు ముందుకు జరగడంతో ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ జనసాంద్రత తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హ్యుమానిటేరియన్‌ ఏజెన్సీ కేర్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

కొండ చరియలు విరగిపడ్డంతో సుమారు ఆరు గ్రామాలపై ప్రభావం పడుతుందని ఆస్ర్టేలియా హైకమిషన్‌ అధికారులు పోర్ట్‌ మోర్స్‌బీ లో చెప్పారు. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి జేమ్స్‌ మారాపై డిజాస్టర్‌ అధికారులు, రక్షణ రంగానికి చెందిన సిబ్బంది, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హైవేలను సంఘటన స్థలానికి పంపించి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే దక్షిణ పసిఫిక్‌ దేశం పావువా న్యూ గినియాలో తరచూ ప్రకృతి విపత్తులు సంభవిస్తుంటాయి. ఇక్కడ విపరీలమైన వర్షాలు, వరదలు రావడం అదే సమయంలో భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ఏడాది మార్చి ఇదే ప్రావిన్స్‌లో కొండి చరియలు విరిగిపడి 23 మంది మృత్యువాతపడ్డారు.

Exit mobile version