Site icon Prime9

Israel-Hamas conflict: ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ.. 1,100 దాటిన మృతుల సంఖ్య

Israel-Hamas conflict

Israel-Hamas conflict

Israel-Hamas conflict: ఇజ్రాయెల్ ,పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌ మధ్య జరుగుతున్న పోరాటంలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు. గాజాలో సుమారుగా 413 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

మ్యూజిక్ ఫెష్టివల్ పై దాడి.. 260 మంది మృతి..(Israel-Hamas conflict)

ఒక మ్యూజిక్ ఫెష్టివల్ పై హమాస్ జరిపిన దాడి కారణంగా చనిపోయిన 260 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెలీ రెస్క్యూ సర్వీస్ జకా నివేదించింది. ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు ఫెస్టివల్ కు వెళ్లిన వారు పిచ్చిగా పరుగెత్తడం మరియు దాడిని తప్పించుకోవడానికి వాహనాల్లో ఆశ్రయం పొందడాన్ని చూపించాయి.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని అనేక మంది సభ్యులు ఆదివారం హమాస్‌ను ఖండించగా, ఏకాభిప్రాయం లేకపోవడంపై యునైటెడ్ స్టేట్స్ విచారం వ్యక్తం చేసింది. అత్యవసర సమావేశంలో, యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ రెండూ పాలస్తీనా ఇస్లామిస్టులను గట్టిగా ఖండించాలని పిలుపునిచ్చాయి.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు అదనపు మద్దతుని ప్రకటించారు. డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ విమాన వాహక నౌక మరియు యుద్ధనౌకల సమూహాన్ని తూర్పు మధ్యధరా ప్రాంతానికి తరలించాలని చెప్పారు. ఈ ప్రాంతంలో యుద్ధ విమానాల స్క్వాడ్రన్‌లను పెంచుతున్నట్లు తెలిపారు.

ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్..

ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులను నిర్వహించడంలో ఇరాన్ తన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇరాన్ యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారులు మరియు గాజాలోని హమాస్ మరియు హిజ్బుల్లాతో సహా నాలుగు ఇరాన్-మద్దతు గల మిలిటెంట్ గ్రూపుల ప్రతినిధులు హాజరైన బీరుట్‌లో పలు సమావేశాలలో ఆపరేషన్ గురించి చర్చించినట్లు సమాచారం.ఇస్లామిక్ జిహాద్ చీఫ్ జియాద్ అల్-నఖలా ఆదివారం మాట్లాడుతూ, గాజా స్ట్రిప్‌లో కిడ్నాప్ చేయబడిన 30 మందికి పైగా ఇజ్రాయెల్‌లను తమ వర్గం బందీలుగా ఉంచిందని చెప్పారు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వేలాది మంది పాలస్తీనియన్లను ప్రస్తావిస్తూ మా ఖైదీలందరినీ విడుదల చేసే వరకు బందీలను స్వదేశానికి పంపించమని పేర్కొన్నారు. హమాస్ తన దాడిని ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్ గా పేర్కొంది. వెస్ట్ బ్యాంక్‌లోని ప్రతిఘటన యోధులు, అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు యుద్ధంలో చేరాలని పిలుపునిచ్చింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియెహ్ తమదే విజయం అని అంచనా వేశారు. మన భూమిని మరియు జైళ్లలో మగ్గుతున్న మన ఖైదీలను విముక్తి చేసే యుద్ధంతో ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు.

Exit mobile version
Skip to toolbar